Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:43 AM

మునిపంపుల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి: సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం

24-12-2025 228 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
లైట్లు విరాళంగా ఇచ్చిన డా. తత్తరి సాయి బాబు

దాతల సహకారం మరువలేనిది:

(మునిపంపుల, స్థానికం న్యూస్ - డిసెంబర్ 24): గ్రామాభివృద్ధిలో ప్రభుత్వ కృషితో పాటు దాతలు కూడా భాగస్వామ్యం కావాలని, సమస్యల పరిష్కారానికి తమ వంతు తోడ్పాటును అందించాలని మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం పిలుపునిచ్చారు.

బుధవారం మునిపంపుల గ్రామ పరిధిలోని తుమ్మబావిగూడెంలో డాక్టర్ తత్తరి సాయిబాబు ఆర్థిక సహకారంతో సమకూర్చిన 25 ఎల్ఈడీ (LED) వీధి లైట్లను గ్రామ పంచాయతీ సిబ్బంది సహాయంతో విద్యుత్ స్తంభాలకు అమర్చారు.

సమస్య పరిష్కారానికి తక్షణ స్పందన: ఈ సందర్భంగా సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం మాట్లాడుతూ.. తుమ్మబావిగూడెంలో గత కొంతకాలంగా వీధి లైట్లు సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని గమనించిన డాక్టర్ తత్తరి సాయిబాబు సామాజిక బాధ్యతతో, స్వచ్ఛందంగా ముందుకొచ్చి లైట్లను బహూకరించడం

అభినందనీయమన్నారు. ప్రజల సౌకర్యార్థం లైట్లను అందజేసిన సాయిబాబుకు సర్పంచ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలోని ఇతర అవసరాలకు కూడా దాతలు ముందుకు వచ్చి సహకరించాలని ఆయన కోరారు.

పాల్గొన్న వారు:

ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యులు కట్ట అరుణ్ కుమార్, పట్టేటి నర్సింహా, అప్పం సురేందర్, గంటెపాక శివ కుమార్, బుంగ ప్రవీణ్, రావుల సైదులు, బండ్ల దయాకర్, గంటెపాక సాయి కుమార్, కట్ట శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మునిపంపుల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి: సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News