Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:30 AM

ముగ్ధంపల్లికి కొత్త సారథి: సర్పంచిగా శిగ నరేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం

22-12-2025 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ముగ్ధంపల్లికి కొత్త నాయకత్వం: సర్పంచిగా శిగ నరేష్ గౌడ్ ప్రమాణం

స్థానికం ప్రతినిధి

బీబీనగర్ మండలం ముగ్ధంపల్లి గ్రామానికి కొత్త నాయకత్వం ఏర్పడింది. గ్రామ సర్పంచిగా శిగ నరేష్ గౌడ్ సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ సెక్రెటరీ శైలజ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నరేష్ గౌడ్ మాట్లాడుతూ— గ్రామ ప్రజల ఆశీర్వాదంతో సర్పంచిగా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందన్నారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పారదర్శక పాలన అందిస్తూ, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తానని స్పష్టం చేశారు. గ్రామంలో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దల సహకారం ఎల్లప్పుడూ అవసరమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయ సహకారాలతో ముగ్ధంపల్లిని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు.

గ్రామంలోని ప్రతి పౌరుడి సమస్య తనదేనని, ప్రత్యక్షంగా గానీ, ఫోన్ ద్వారా గానీ తెలియజేస్తే వెంటనే స్పందించి సేవకుడిగా పనిచేస్తానని ప్రమాణ స్వీకార సభలో భగవంతుని సాక్షిగా ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శెట్టి సోని, వార్డు సభ్యులు ఎంజాల వెంకటేష్, మట్ట గోపికృష్ణ గౌడ్, ఎర్ర ప్రసన్న రెడ్డి, గోరుగంటి శంకర్, వడ్ల కొండ బాలకృష్ణ, పాదం రాధిక, బండారి సురేష్ పాల్గొన్నారు. గ్రామ సెక్రెటరీ శైలజతో పాటు గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Sthanikam

ముగ్ధంపల్లికి కొత్త సారథి: సర్పంచిగా శిగ నరేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News