Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:20 AM

మాతృభాష మహిమకు మహోత్సవ వేదిక – చాట్రాయి జెడ్పీ హైస్కూల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

21-02-2026 147 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

ముందుగా మండల విద్యాశాఖాధికారి–1 మాసగిరి శ్రీనివాస్ తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు భాష అమృతభాషగా, అజంతా భాషగా ప్రసిద్ధి చెందినదని తెలిపారు. “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్”గా పేరుగాంచిన తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు. శ్రీకృష్ణదేవరాయలు “దేశ భాషలందు తెలుగు లెస్స” అని కొనియాడిన విషయాన్ని గుర్తుచేశారు.

అమ్మ భాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆంగ్ల భాష అవసరమైనప్పటికీ మాతృభాషను మరువరాదని సూచించారు.

అనంతరం తెలుగు, హిందీ బోధిస్తున్న మహిళా ఉపాధ్యాయినులను సన్మానించి సత్కరించారు. ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య, ఉపాధ్యాయులు అమరయ్య, సత్యనారాయణ రెడ్డి, తేరా రామారావు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sthanikam

మాతృభాష మహిమకు మహోత్సవ వేదిక – చాట్రాయి జెడ్పీ హైస్కూల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

ముందుగా మండల విద్యాశాఖాధికారి–1 మాసగిరి శ్రీనివాస్ తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు భాష అమృతభాషగా, అజంతా భాషగా ప్రసిద్ధి చెందినదని తెలిపారు. “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్”గా పేరుగాంచిన తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు. శ్రీకృష్ణదేవరాయలు “దేశ భాషలందు తెలుగు లెస్స” అని కొనియాడిన విషయాన్ని గుర్తుచేశారు.

అమ్మ భాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆంగ్ల భాష అవసరమైనప్పటికీ మాతృభాషను మరువరాదని సూచించారు.

అనంతరం తెలుగు, హిందీ బోధిస్తున్న మహిళా ఉపాధ్యాయినులను సన్మానించి సత్కరించారు. ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య, ఉపాధ్యాయులు అమరయ్య, సత్యనారాయణ రెడ్డి, తేరా రామారావు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News