Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:47 PM

మతోన్మాద భావజాల వ్యాప్తి సమాజానికి హానికరం

మతోన్మాద భావజాల వ్యాప్తి సమాజానికి హానికరం

మతోన్మాద భావజాల వ్యాప్తి సమాజానికి హానికరం
January 11, 2026 05:14 AM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-ఎదుర్కోవడం కోసం సామాజిక,ఆర్థిక,సాంస్కృతిక రంగంలో కృషి పెరగాలి

-కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా కార్మిక విద్యార్థి యువజన మహిళా వ్యతిరేక విధానాలు

- బీవీ రాఘవులు,సిపిఎం పొలిటి బ్యూరో సభ్యులు

స్థానికం:యదాద్రి భువనగిరి జిల్లా బుర్యో జి.శ్రీనివాస్

గ్రామాల్లో బిజెపి మతోన్మాద భావజాల వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతున్నది దీనిని అణిచివేయడం కోసం గ్రామీణ స్థాయిలో సాంస్కృతిక రంగంలో మన కృషి పెరగాలని సిపిఎం పోలిక్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ...దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద భావజాల వ్యాప్తి అడ్డు అదుపు లేకుండా పెరుగుతుందని, కులం పేరుతో మతం పేరుతో మనుషుల మధ్య విషయాన్ని నింపి చీలికలు తీసుకొస్తుందని మూడోసారి అధికారులకు వచ్చిన తర్వాత మతోన్మాద భావాజాలం గ్రామీణ స్థాయిలో పెట్రేగిపోతుందని వారు గుర్తు చేశారు. అదేవిధంగా బడా కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా గతంలో రైతుల పొట్టగొట్టే నల్ల చట్టాలను తీసుకురావడం, అనేక పోరాటాలు చేసి సాధించుకున్న లేబర్ కోడ్ లను నాలుగు చట్టాలుగా సవరణ చేయడం,ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా పేరు మార్చుతూ చట్టాన్ని పూర్తిగా వ్యవసాయ కూలీలకు దూరం చేయాలని చూస్తుందని అదేవిధంగా విత్తన చట్టాన్ని తీసుకురావడం, విద్యుత్ సవరణ బిల్లును తీసుకురావడం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయాలని ఆలోచనలు చేయడం అనేక రకాల ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకురావాలనే కుట్ర బిజెపి చేస్తుందని బిజెపి విధానాలు రాష్ట్రాల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని గ్రామీణ స్థాయిలో రాష్ట్రాల హక్కులను కేంద్రం గుప్పిట్లో పెట్టుకుని పరిపాలన సాగిస్తుందని వారు అన్నారు. ఈ సందర్భంగా బిజెపి చేస్తున్న మతోన్మాద రాజకీయాలను ఎండగడుతూ...ఎప్పటికప్పుడు సాంస్కృతిక రంగంలో కృషి పెరిగి బిజెపి మతోన్మాద భావజాల వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని వారు పిలుపునిచ్చారు. వీరితోపాటు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి మతోన్మాద భావజాలాన్ని పెంచుతూ మరొకవైపు కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను తీసుకొస్తూ పరిపాలన సాగిస్తుందని రానున్న కాలంలో బిజెపి ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని వారు అన్నారు. మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ...మతం పేరుతో కులం పేరుతో బిజెపి చేస్తున్న రాజకీయాలను సిపిఎం గ్రామీణ స్థాయిలో ఎప్పటికప్పుడు ఎండగట్టాలని సిపిఎం శ్రేణులకు పిలుపునిచ్చారు.సిపిఐఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ...బిజెపి ఆర్ఎస్ఎస్,సేవా,మహనీయుల జయంతులు,పండుగల ముసుగులో చాప కింద నీరుల గ్రామాల్లో పాకుతుంది. ప్రజల ఆలోచన మార్చి మతోన్మాద భావజాలాన్ని పెంచుతుంది.ఇది దేశానికి ప్రమాదకరంగా మారుతుంది అని మతోన్మాద భావజాలాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అని వారు అన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు,కల్లూరి మల్లేశం,దాసరి పాండు,బూరుగు కృష్ణారెడ్డి,గుంటోజు శ్రీనివాసాచారి, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి,సిర్పంగి స్వామి,దయ్యాల నరసింహ,మాయ కృష్ణ, బొల్లు యాదగిరీ,ఎండి.పాష,బొడ్డుపల్లి వెంకటేష్,గుండు వెంకటనర్సు,దోడ యాదిరెడ్డి,మద్దేపూరం రాజు,బోలగాని జయరాములు,అవ్వారు రామేశ్వరి,రాచకొండ రాములమ్మ,ఎంఎ.ఇక్బాల్,వనం ఉపేందర్,గడ్డం వెంకటేష్,మల్లేపల్లి లలిత,బల్గూరి అంజయ్య,కోట రామచంద్రారెడ్డి,గోశిక కరుణాకర్ మండల కార్యదర్శులు ధూపటి వెంకటేష్,పల్లెర్ల అంజయ్య పోతరాజు జహంగీర్,వేముల బిక్షం,ర్యాకల శ్రీశైలం,ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News