Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:07 AM

మతిస్థిమితం లేని యువకుడు అదృశ్యం

మతిస్థిమితం లేని యువకుడు అదృశ్యం

మతిస్థిమితం లేని యువకుడు అదృశ్యం
27-03-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల గ్రామంలో యువకుడు అనుమానాస్పదంగా అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన డోకే రాజశేఖర్ (30) కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం… బుధవారం మధ్యాహ్నం సుమారు 1 గంటల సమయంలో రాజశేఖర్ తన ఇంటి నుండి వ్యవసాయ భూమికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు.సాయంత్రం అయ్యే వరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.తరువాత కుటుంబ సభ్యులు వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి పరిశీలించినా అక్కడ కూడా రాజశేఖర్ కనిపించలేదు. అనంతరం చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టినా ఎటువంటి ఆచూకీ లభించలేదు.కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం రాజశేఖర్‌కు మతిస్థిమితం సరిగా లేదని తెలిపారు. ఆయన ఎత్తు సుమారు 5 అడుగులు, చామన చాయతో ఉండి, ఇంటి నుండి వెళ్లిన సమయంలో మెరూన్ రంగు షర్టు, సిమెంట్ రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు చెప్పారు.ఈ ఘటనపై ఆయన అన్న డోకే శివ శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐ మన్మధ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Sthanikam

మతిస్థిమితం లేని యువకుడు అదృశ్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News