Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:15 AM

మత్స్యవతారంలో నరసింహుడు

మత్స్యవతారంలో నరసింహుడు

మత్స్యవతారంలో నరసింహుడు
20-02-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదగిరిగుట్ట టౌన్:యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఉదయం స్వామివారికి మత్స్యావతార అలంకార సేవను వైభవంగా నిర్వహించారు.మత్స్యావతారంలో అలంకరించబడిన లక్ష్మీ నృసింహ స్వామివారిని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు,అర్చనలు నిర్వహించారు.సాయంత్రం శేష వాహన సేవలో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.శేష వాహనంపై విరాజిల్లే లక్ష్మీ నృసింహుడి దర్శనం బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.ఈ సేవను వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు.ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి,ఈవో భవాని శంకర్,ఇతర అధికారులు,ఆలయ అర్చకులు పాల్గొన్నారు. భక్తులు విశేష భక్తిశ్రద్ధలతో స్వామివారి సేవల్లో పాల్గొన్నారు.

Sthanikam

మత్స్యవతారంలో నరసింహుడు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News