Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:24 PM

మాట నిలబెట్టుకున్న మంత్రి సవిత… సోమందేపల్లిలో నూతన బోర్ ప్రారంభం

23-03-2026 114 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్న మంత్రి సవిత మరో కీలక చర్యకు శ్రీకారం చుట్టారు. సోమవారం సోమందేపల్లి పట్టణంలోని ఉర్దూ పాఠశాల సమీపంలో నూతన త్రాగునీటి బోర్‌వెల్ పనులను ప్రారంభించారు.

కన్వీనర్ నడింపల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర బోయ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డీవీ ఆంజనేయులు, హిందూపురం పార్లమెంట్ టీడీపీ కార్యదర్శి నీరుగంటి చంద్ర, పట్టణ అధ్యక్షుడు వడ్డే సూరి తదితరులు పాల్గొన్నారు. బోర్‌వెల్ తవ్వకాలకు ముందు గ్రామ పెద్దలు గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించగా, బోర్ లారీకి కూడా శుభారంభ పూజలు చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ—గత ఎన్నికల సమయంలో ఉర్దూ పాఠశాల మరియు డి.ఎల్. రోడ్ పరిసర ప్రాంత ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఇచ్చిన హామీని మంత్రి సవిత నిలబెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను తీర్చడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

అనంతరం అనిల్ బోర్‌వెల్ ద్వారా తవ్వకాల పనులు ప్రారంభించగా, ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్త బోర్‌వెల్ ఏర్పాటుతో ఆ ప్రాంత ప్రజల దాహార్తి తీరనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

మాట నిలబెట్టుకున్న మంత్రి సవిత… సోమందేపల్లిలో నూతన బోర్ ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News