Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:21 AM

మాట ఇచ్చి నిలబెట్టిన ఉపముఖ్యమంత్రి – కొణిదెలలో అభివృద్ధి జోరు

22-02-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రూ.6 కోట్లకు పైగా నిధులతో గ్రామం రూపురేఖలు మారుతున్నాయ్

నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు మండలం పరిధిలో ఉన్న కొణిదెల గ్రామం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకెళ్తోంది. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన దత్తత హామీని నిలబెట్టుకుంటూ ఉపముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో రూ.6 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయి.

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

గ్రామంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ఉపముఖ్యమంత్రి తన సొంత నిధుల నుంచి రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. 90,000 లీటర్ల సామర్థ్యం గల రక్షిత ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం పూర్తికావస్తోంది. సుమారు 2 వేల మందికి స్వచ్ఛమైన నీరు అందనుంది.

రహదారులు – మౌలిక వసతుల విస్తరణ

పల్లెపండగ 1.0 కింద మూడు సి.సి. రోడ్లు పూర్తి కాగా, పల్లెపండగ 2.0 కింద మరో ఏడు రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. జిల్లా పరిషత్ పాఠశాల నుంచి లక్ష్మాపురం వరకు 5 కి.మీ బి.టి రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు చేశారు. గ్రామానికి వచ్చే ఆర్ & బి రోడ్డు పునరుద్ధరణకు రూ.45 లక్షలు కేటాయించారు.

గృహాలు – రైతులకు ఊతం

19 ఇళ్లు, 4 పశువుల షెడ్లు నిర్మించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద 49 ఫీడర్ ఛానల్స్ అభివృద్ధి చేసి, రెండు మైనర్ కాలువలను పునరుద్ధరించారు. మూడు చెక్ డ్యామ్స్ మరమ్మతులతో సాగునీరు అందుబాటులోకి వచ్చింది.

తన ఇంటిపేరుతో ఉన్న గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ఉపముఖ్యమంత్రి చర్యలు గ్రామ ప్రజల్లో విశ్వాసం నింపుతున్నాయి. “మాట ఇచ్చి నిలబెట్టిన నాయకుడు” అంటూ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Sthanikam

మాట ఇచ్చి నిలబెట్టిన ఉపముఖ్యమంత్రి – కొణిదెలలో అభివృద్ధి జోరు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News