Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:15 PM

మృతుల కుటుంబాలను ఓదార్చిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

27-12-2025 327 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పలువురి కుటుంబాలను పరామర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ నియోజకవర్గం స్థానిక ప్రతినిధి

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పలువురు మృతుల కుటుంబాలను, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన యర్కల సైదులు, దొరపల్లి వెంకటమ్మ, కటికం లింగయ్య అనారోగ్యంతో మృతి చెందగా వారి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. అదే మండల కేంద్రానికి చెందిన నల్ల బిక్షం అనారోగ్యంతో ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన జటంగి లింగయ్య, నీలకంఠం బాలనర్సమ్మ అనారోగ్యంతో మృతి చెందగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు. అలాగే అదే మండలానికి చెందిన మొగిలి యాదమ్మ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆమెను పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డుకు చెందిన పెండెం పార్వతమ్మ, 11వ వార్డుకు చెందిన ముశాం కమలమ్మ అనారోగ్యంతో మృతి చెందగా వారి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు.

ఈ పరామర్శ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

మృతుల కుటుంబాలను ఓదార్చిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News