Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీఎంజేఎఫ్ మూడవ రాష్ట్ర మహాసభలకు కరపత్రికల ఆవిష్కరణ. ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 02:54 AM

మృతుడి కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి భరోసా..

26-03-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేత పిల్లల చదువుకు హామీ..

నల్గొండ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కనగల్ మండల కేంద్రానికి చెందిన ఎటెల్లి పరశురాం కుటుంబానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండగా నిలిచారు. గురువారం నాడు ఆయన పరశురాం నివాసానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి, మృతుడి భార్య సంధ్యను మరియు పిల్లలను ఓదార్చారు. తక్షణ ఆర్థిక సహాయం కింద తన వ్యక్తిగత నిధుల నుండి ఒక లక్ష రూపాయల నగదును వారికి అందజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి తాను ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా పరశురాం పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వారి చదువుకు కావాల్సిన పూర్తి సహకారాన్ని అందిస్తానని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.మంత్రి మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు పరశురాం మృతి చెందడం అత్యంత బాధాకరం. ఆ కుటుంబం వీధిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పిల్లల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం తరపున వ్యక్తిగతంగానూ అన్ని విధాలా ఆదుకుంటాం అని పేర్కొన్నారు.

Sthanikam

మృతుడి కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి భరోసా..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News