Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:09 PM

మార్జిన్‌ వివాదం: తెలంగాణలో రేపటి నుంచి చికెన్‌ షాపుల నిరవధిక బంద్‌

31-03-2026 139 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి చికెన్‌ షాపులు నిరవధికంగా బంద్‌ కానున్నాయి. ఫౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే మార్జిన్‌ను తగ్గించడంతో వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్జిన్‌ను పెంచే వరకు విక్రయాలు నిలిపివేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చికెన్‌ షాప్‌ యజమానులు నిర్ణయించారు.చికెన్‌ విక్రయాల్లో తగిన లాభం లేకపోవడం వల్ల వ్యాపారం నష్టాల్లోకి వెళ్లుతోందని షాప్‌ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫౌల్ట్రీ కంపెనీలు ఇటీవల మార్జిన్‌ను తగ్గించడంతో తమపై ఆర్థిక భారం మరింత పెరిగిందని వారు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించడం కష్టసాధ్యమైందని తెలిపారు.ఈ నేపథ్యంలో మార్జిన్‌ను పునర్విమర్శించి పెంచాలని డిమాండ్‌ చేస్తూ, రేపటి నుంచినిరవధికబంద్‌కుపిలుపునిచ్చినట్లు తెలంగాణ చికెన్‌ షాప్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. ఫౌల్ట్రీ కంపెనీలు తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించే వరకు బంద్‌ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఈ బంద్‌ ప్రభావంతో రాష్ట్రంలో చికెన్‌ సరఫరా, ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వినియోగదారులు ప్రత్యామ్నాయాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడవచ్చని భావిస్తున్నారు.ఇకపోతే, సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరగాల్సిన అవసరం ఉందని వ్యాపార వర్గాలు సూచిస్తున్నాయి.

Sthanikam

మార్జిన్‌ వివాదం: తెలంగాణలో రేపటి నుంచి చికెన్‌ షాపుల నిరవధిక బంద్‌

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News