Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

మార్చి నాటికి లక్ష గృహప్రవేశాల లక్ష్యం

మార్చి నాటికి లక్ష గృహప్రవేశాల లక్ష్యం

మార్చి  నాటికి లక్ష గృహప్రవేశాల లక్ష్యం
10-02-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రటరీ వి.పి.గౌతమ్

పెదకాపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన

లబ్ధిదారులతో నేరుగా మాట్లాడిన సెక్రటరీమార్చి చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష గృహప్రవేశాలు పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రటరీ వి.పి.గౌతమ్ స్పష్టం చేశారు. మంగళవారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి గ్రామంలో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్‌తో కలిసి నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాలను ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.గ్రామంలోని ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు స్వయంగా వెళ్లిన సెక్రటరీ, ఇప్పటివరకు బ్యాంకులో జమ అయిన మొత్తం, నిర్మాణ అంచనాలు, ఇప్పటివరకు చేసిన ఖర్చు వివరాలను లబ్ధిదారులను నేరుగా అడిగి తెలుసుకున్నారు.

మంజూరైన మొత్తంలోనే ఇల్లు నిర్మించాలిగ్రామంలో చాలా చోట్ల ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసి ఇళ్లు నిర్మించుకుంటున్న విషయాన్ని గమనించిన సెక్రటరీ, లబ్ధిదారులకు కీలక సూచనలు చేశారు.“ప్రభుత్వం మంజూరు చేసినమొత్తంలోనేఇల్లుపూర్తిచేసుకోవాలి. అప్పులు చేసి అదనపు ఖర్చులతో ఇళ్లు నిర్మించుకోవద్దు” అని స్పష్టం చేశారు.ఈ విషయంలో ఇందిరమ్మ కమిటీలు గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని, స్థానిక మేస్త్రీల సహకారంతో నిర్మాణ వ్యయం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోసారి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలతో సమావేశం నిర్వహించి లబ్ధిదారులందరికీ స్పష్టత ఇవ్వాలని స్థానిక సర్పంచ్ కాటం వెంకటేశంకు సూచించారు.

ఫినిషింగ్ స్టేజీలో 6300 ఇండ్లు

ఇందిరమ్మ గృహ నిర్మాణంతో పాటు ఉపాధి హామీ కింద మంజూరు చేసే బిల్లులు, మరుగుదొడ్ల నిర్మాణ వివరాలపై కూడా సెక్రటరీ ఆరా తీశారు.

స్లాబ్, రూఫ్ స్థాయికి వచ్చిన వెంటనే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి బుక్ చేయించాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌కు, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్‌కు సూచించారు.జిల్లాలో ఫినిషింగ్ స్టేజీలో ఉన్న ఇండ్ల వివరాలను అడగగా, 6300 ఇందిరమ్మ ఇండ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటన్నింటినీ మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని సెక్రటరీ ఆదేశించారు.రాష్ట్ర స్థాయిలోనూ మార్చి నాటికి లక్ష గృహప్రవేశాల లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.ఇంకా ప్రారంభం కాని ఇండ్లపై ప్రత్యేక దృష్టిఅనంతరం ఎస్సీ కాలనీలో ఇంకా నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులతో సెక్రటరీ సమావేశమయ్యారు.

ఇళ్లు ప్రారంభించకపోవడానికి గల కారణాలను తెలుసుకొని, మహిళా సంఘాల ద్వారా ముందుగా రూ.లక్ష రుణం మంజూరు చేసి నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని సూచించారు.

లబ్ధిదారులు స్వప్న, సంతోష్, కళమ్మ, మాధవి తదితరుల ఇళ్లకు వెళ్లి నిర్మాణాలను పరిశీలించిన సెక్రటరీ, ముఖాముఖి మాట్లాడారు. అలాగే నిర్మాణం ప్రారంభించని ప్రమీల,చోల్లేటిసత్యనారాయణలతోనూ చర్చించారు.ప్రభుత్వం నిర్దేశించిన కొలతలే పాటించాలిజిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్మాట్లాడుతూ,“ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారమే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలి. ఎక్కువ కొలతలతో ఇళ్లు కడితే ఖర్చు పెరిగి లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురవుతాయి” అని హెచ్చరించారు.ఈ అంశంపై గ్రామంలో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయలక్ష్మి, ఏఈ ప్రీతి, సర్పంచ్ కాటం వెంకటేశం తదితర అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

మార్చి నాటికి లక్ష గృహప్రవేశాల లక్ష్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News