Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం వర్ధిల్లాలి : వేముల బక్కయ్య

09-03-2026 155 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా నందిపాము రాణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు మిఠాయిలు పంచారు.

సభలో మహిళా సభ్యులు మాట్లాడుతూ రమణక్కపేట ఎస్సీ దళితవాడలో మినీ అంగనవాడి సెంటర్ మంజూరు చేయాలని జిల్లా కమిటీ సభ్యురాలు పల్లెపాము భవాని డిమాండ్ చేశారు. కమ్యూనిటీ భవనం మంజూరు చేయాలని దార బేబీ శాలిని కోరారు. ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని నందిపాము రాణి, స్మశానవాటిక భూమి మంజూరు చేయాలని ఆముదాల సామ్రాజ్యం, పశు వైద్యశాలకు నూతన భవనం నిర్మించాలని వేముల మహాలక్ష్మి డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి వేముల బక్కయ్య మాట్లాడుతూ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సంఘటిత మహిళా పోరాటాలకు ప్రతీక అని తెలిపారు. 120 సంవత్సరాల క్రితం అమెరికాలో మహిళా కార్మికులు అధిక పనిగంటలు, తక్కువ వేతనాలు, దుర్భరమైన పని పరిస్థితులకు వ్యతిరేకంగా గొప్ప పోరాటాలు నిర్వహించారని అన్నారు. ఆ పోరాటం మహిళల ఓటుహక్కు, సమానత్వం కోసం ఉద్యమంగా మారి 1910లో కమ్యూనిస్టు నాయకురాలు క్లారా జెట్‌కిన్ పిలుపుతో మార్చి 8ను అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంగా జరుపుకుంటున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులు, హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, పని దినాలను 200 రోజులకు పెంచాలని, రోజుకు 600 రూపాయలు వేతనం చెల్లించాలని, వీబీ గ్రామజీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌ఎస్‌పీ కాల్వపై వంతెన నిర్మాణం చేపట్టాలని, ఫారెస్ట్ రెవెన్యూ గ్రామాల్లో రైతులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించి సాగుభూములకు పట్టాలు మంజూరు చేయాలని, ఫారెస్ట్ నాలుగో నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరారు. అలాగే ఆడబిడ్డ నిధిగా నెలకు రూ.1500 ఇవ్వాలని, కౌలు రైతులకు హామీలేని రుణాలు అందించాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నందిపాము రాణి, వేముల మహాలక్ష్మి, ఆముదాల పార్వతి, ఆముదాల చినబాబు, వేముల చంటి, ఉయ్యూరు విజయలక్ష్మి, ఆముదాల వరాజ్యం, నందిపాము నవ్య, తానంకి మరియమ్మ, ఆముదాల సుగంధరాణి, ఆముదాల నాగరత్నం, దారా బేబీ శాలిని, ఆముదాల ప్రవళిక, నందిపాము రత్నకుమారి, ఆముదాల రత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం వర్ధిల్లాలి : వేముల బక్కయ్య

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News