Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:46 AM

మూడవ విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం పర్యావరణహిత ఆదర్శ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు

16-12-2025 126 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదర్శ పోలింగ్ కేంద్రం ఏర్పాట్లపై కలెక్టర్ తనిఖీ

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడవ విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తెలిపారు. అడ్డగూడూరు, మోత్కూరు, మోటకొండూర్, గుండాల, చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల్లో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లోని పోలింగ్ కేంద్రం, అడ్డగూడూరు మండలం చౌళ్ల రామారం గ్రామంలోని ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ బూత్ బయట గుర్తులతో కూడిన ఫారం–9ను అతికించాలని, ఓటింగ్ కంపార్ట్మెంట్లు సక్రమంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించాలన్నారు.

పండుగ వాతావరణంలో పోలింగ్ఆదర్శ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఆహ్లాదకరమైన అనుభూతి కలిగించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మట్టి కుండల్లో తాగునీరు, పోలింగ్ కేంద్రాల ముందు రంగవల్లులు, పచ్చని మొక్కలతో అలంకరణ, కొబ్బరి మట్టలు, పూలతో సౌందర్యవంతంగా తీర్చిదిద్దడం జరిగింది. అరటి ఆకులతో సెల్ఫీ పాయింట్లు, గ్రీన్ మ్యాట్‌లు ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.

6 మండలాల్లో ఆదర్శ పోలింగ్ కేంద్రాలు

జిల్లాలోని ఆరు మండలాల్లో ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

  1. అడ్డగూడూరు మండలం: చౌళ్ల రామారం
  2. మోత్కూరు మండలం: పాటిమట్ల
  3. గుండాల మండలం: పాచిల్ల
  4. మోటకొండూర్ మండలం: ముత్తిరెడ్డి గూడెం
  5. చౌటుప్పల్ మండలం: అరెగూడెం
  6. నారాయణపూర్ మండలం: చిమిర్యాల

ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ తెలిపారు

Sthanikam

మూడవ విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం పర్యావరణహిత ఆదర్శ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News