Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 10:18 PM

మోడీ ప్రభుత్వం తీసుకొచ్చి జి రామ్ జి చట్టాలు, నాలుగు లేబర్ కోడ్లను,విత్తన చట్టాన్ని,విద్యుత్తు సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలి.

మోడీ ప్రభుత్వం తీసుకొచ్చి జి రామ్ జి చట్టాలు, నాలుగు లేబర్ కోడ్లను,విత్తన చట్టాన్ని,విద్యుత్తు సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలి.

మోడీ ప్రభుత్వం తీసుకొచ్చి జి రామ్ జి చట్టాలు, నాలుగు లేబర్ కోడ్లను,విత్తన చట్టాన్ని,విద్యుత్తు సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలి.
January 07, 2026 03:39 AM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

కేంద్రం ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఈనెల 19న జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న నిరసన సభను జయప్రదం చేయండి.

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరోజి.శ్రీనివాస్

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కొడ్లను, జి రామ్ జి చట్టాన్ని, విద్యుత్తు సవరణ చట్టం, విత్తన బిల్లును వెంటనే విరమించుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ డిమాండ్ చేసినారు. ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల19న భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న నిరసన సభలో కార్మికులు, ఘర్షకులు, వ్యవసాయ కూలీ, పేదలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం మోత్కూరు పట్టణంలోని యూటిఎప్ కార్యాలయంలో లేబర్ కోడ్లను,జి.రామ్ జి చట్టం, విద్యుత్ సవరణ బిల్లును,విత్తన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు,రైతు సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షతన " రౌండ్ టేబుల్ సమావేశం'' జరగగా ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాయడమే కాక రాష్ట్రాల హక్కులను హరిస్తూ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ,అంబానీ వంటి బడా పెట్టుబడిదారులకు కట్టబెడుతుందని విమర్శించారు. వామపక్షాల పోరాట ఫలితంగా 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారెంటీ చట్టము వచ్చిందని. ఈ చట్టం వల్ల గ్రామీణ పేదలు ఆర్థికంగా తమ కుటుంబ పోషణకు ఉపాధి దొరికిందని అన్నారు. ఈ చట్టం ద్వారా కరువుల్లో, కరోనా సందర్భంగా గ్రామీణ ప్రజలకు ఎంతో ఊరట కలిగిందని అన్నారు. ఇలాంటి చట్టాన్ని బిజెపి ప్రభుత్వము ఎత్తివేయాలని కుట్రబుద్ధితో జి రామ్ జి చట్టం తెచ్చిందని విమర్శించారు. ఇప్పటికైనా పాత చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం కోసం ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తూ వారి సంక్షేమాన్ని రద్దుచేసి బడ పెట్టుబడుదారులకు ఊడిగం చేస్తుందని విమర్శించారు. కార్పొరేట్లకు అనుకూలంగా విత్తన బిల్లును, విద్యుత్ సవరణ చట్టం తీసుకొచ్చిందని దీని ద్వారా రైతాంగము, పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వెలిబుచ్చారు. దేశంలో ఉన్న సహజ వనరులను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం బిజెపి మోడీ ప్రభుత్వ విదానంగా మారిందని విమర్శించారు. ఈ విధానాలను తిప్పి కొట్టడానికి జిల్లా కేంద్రంలో 19న నిర్వహిస్తున్న నిరసన సభా కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని నర్సింహ కోరారు. ఇంకా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అవిశెట్టి అవిలిమల్లు, సిపిఎం మండల కార్యదర్శి గుండు వెంకట్ నర్స్, సిపిఐ మండల కార్యదర్శి అన్నెపు వెంకన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూర్నేని స్వామి రాయుడు, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పానుగుల రమేష్,టిడిపి మండల పార్టీ అధ్యక్షులు డి.సత్యనారాయణ,వి.ఆర్.పి జిల్లా అధ్యక్షులు ఎడ్ల నరేష్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మెతుకు అంజయ్య తోపాటు ప్రజాసంఘాల నాయకులు తరిమల నరసయ్య, ఉయ్యాల అంజయ్య, యండి.గాలిప్,గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News