Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:17 AM

మొక్కజొన్న, వరి రైతులకు యూరియా కొరత లేదు: డీడీఏ చంద్రశేఖర్

31-12-2025 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూసుమంచిలో యూరియా సరఫరాపై ప్రత్యేక అధికారి తనిఖీ

ఖమ్మం స్థానిక ప్రతినిధి జనార్ధన్

కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు చేగోమ్మ, కూసుమంచి ప్రాంతాల్లో ఉన్న మన గ్రోమోర్ సెంటర్లలో యూరియా పంపిణీ విధానాన్ని హైదరాబాదులోని కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రత్యేక అధికారి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ చంద్రశేఖర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మొక్కజొన్న, వరి నాట్లు జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ రెండు పంటలు సాగు చేస్తున్న రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులకు అవసరమైన మేరకు యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, కొరతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.

రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని డిమాండ్‌కు అనుగుణంగా యూరియా నిల్వలు కొనసాగిస్తామని, వానాకాలంలో ఏర్పాటు చేసిన సబ్ సెంటర్ల ద్వారా కూడా యూరియా పంపిణీ జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కూసుమంచి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు సతీష్, మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి, ఏఈఓలు జానీ, రవికుమార్, రవీందర్ పాల్గొన్నారు.

Sthanikam

మొక్కజొన్న, వరి రైతులకు యూరియా కొరత లేదు: డీడీఏ చంద్రశేఖర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News