Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:00 PM

మొదటి వాగ్దానం అమలు చేసిన సర్పంచ్ కాటం వెంకటేశం

02-01-2026 120 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చిట్యాల, కొమిడాల మహేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలో కోతుల బెడదకు చెక్ పెట్టే దిశగా సర్పంచ్ కాటం వెంకటేశం తొలి అడుగు వేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మొదటి హామీని నూతన సంవత్సరంలోనే అమలు చేస్తూ గురువారం ఆంధ్రకు చెందిన నిపుణులను తీసుకువచ్చి కోతులు పట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గ్రామంలో కోతులు విపరీతంగా పెరిగి పంటలు, ఇళ్లకు నష్టం కలిగించడంతో పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఇప్పటివరకు 50కి పైగా కోతులను పట్టినట్లు పేర్కొన్నారు. కోతుల సమస్య పూర్తిగా నివారించి గ్రామాన్ని సురక్షితంగా మార్చడమే లక్ష్యమన్నారు.

ఈ చర్యతో రైతులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేయగా, చిన్నపిల్లలు–వృద్ధుల్లో నెలకొన్న భయాందోళన తగ్గుతుందని ఆశాభావం వ్యక్తమైంది. వాగ్దానం నిలబెట్టుకున్న సర్పంచ్ కాటం వెంకటేశాన్ని గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు అభినందించారు.

Sthanikam

మొదటి వాగ్దానం అమలు చేసిన సర్పంచ్ కాటం వెంకటేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News