Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:05 AM

మానవ అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలి. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు

మానవ అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలి. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు

మానవ అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలి.  జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు
May 16, 2026 08:50 PM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, : మానవ అక్రమ రవాణా తీవ్రమైన నేరమని, అలాంటి కార్యకలాపాలకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన శిక్షలు తప్పవని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ ఎస్‌. సాయిశ్రీనివాస్, ఎన్‌. రాజశేఖర్ అన్నారు.

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు భువనగిరి పట్టణంలోని తాతానగర్‌లో స్కీడ్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, స్కీడ్ స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో హెచ్‌ఆర్‌జీ కమ్యూనిటీ సభ్యులు, ఇతరులకు మానవ అక్రమ రవాణా నిరోధక చట్టాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైంగిక దోపిడి, వెట్టిచాకిరి, చిన్నారులతో బిక్షాటన వంటి అవసరాల కోసం మనుషులను అక్రమంగా రవాణా చేయడం నేరమన్నారు. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ వ్యవస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులకు న్యాయ సహాయం అందించేందుకు జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.

స్కీడ్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్‌. నాగరాజు మాట్లాడుతూ బాధితులను గుర్తించి వారికి మానవతా దృక్పథంతో సేవలు అందిస్తున్నామని తెలిపారు.

కార్యక్రమంలో హెచ్‌ఐవీ–ఎయిడ్స్ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ వంశీకృష్ణ, ప్రాజెక్ట్ మేనేజర్ భానుకుమార్, సెంట్రల్ కోఆర్డినేటర్ మిథున్, ఆర్గనైజర్ వెంకటేష్, కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News