Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:38 AM

మానసిక ఆరోగ్యంతోనే నాణ్యమైన విద్య- సుధీర్, జిల్లా మానసిక ఆరోగ్య కౌన్సిలర్ ఎస్.ఎస్.ఏ. ఏలూరు

17-02-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

మానసిక ఆరోగ్యంతోనే నాణ్యమైన విద్య- సుధీర్, జిల్లా మానసిక ఆరోగ్య కౌన్సిలర్

ఎస్.ఎస్.ఏ. ఏలూరు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతీ స్కూల్లో విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై అవగాహన పెంచేందుకు చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా జి.సి.డి.ఓ. బి. నవీనకుమారి, ఏ. పి. సి. డా. కె. పంకజ్ కుమార్ ల పర్యవేక్షణలో చింతలపూడి మండలం, డా. బి. ఆర్. అంబేద్కర్ గురుకులం బాలురు హైస్కూల్ చింతలపూడి లో ప్రిన్సిపల్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలలో జిల్లా మానసిక ఆరోగ్య కౌన్సిలర్స్ ఏం. సుధీర్ కుమార్

14,17 తేదీలలో విద్యార్థులకు కెరీర్ మరియు మానసిక ఆరోగ్యంపై అవగాహన సెషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మానసిక ఆరోగ్యంతోనే నాణ్యమైన విద్యా సాధ్యం అని, విద్యార్ధులు అపోహలకు దూరంగా ఉండాలని, భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని చదువులో రాణించాలని, క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని, లక్ష్యం ఆధారిత చదువు అలవాటు చేసుకోవాలని, ప్రతీ రోజూ ఒక క్రొత్త విషయాన్ని నేర్చుకోవాలని, యోగా, ధ్యానం మరియు ఆటపాటలతో మానసిక ఒత్తిడి దూరం అవుతుందని విద్యార్థి దశ నుంచే వినూత్నంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలని, మొబైల్, డ్రగ్స్, సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలని సూచించారు.అనంతరం విద్యార్దులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు తెలుసుకుని వాటిని ఎలా అధిగమించాలో యాక్టివిటీస్ ద్వారా వివరించారు. ఉపాద్యాయులు విద్యార్ధులతో ప్రేమగా మెలగాలని, వారి సమస్యలు ఎప్పటికపుడు తెలుసుకోవాలని సూచించారు. అనంతరం ప్రిన్సిపల్ విజయ్ గారు మాట్లాడుతూ ఇలాంటి మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో అవసరం అని గుర్తించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జి.సి.డి.ఓ. బి. నవీన కుమారి, ఏ.పీ.సి. పంకజ్ కుమార్, జిల్లా మానసిక ఆరోగ్య కౌన్సిలర్ ఏం. సుధీర్ కుమార్ గార్లకు కృతద్నతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో ఒక సైకియాట్రీస్ట్ లేదా సైకాలజిస్ట్ ను సంప్రదించటానికి నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్: టెలి మానస నెంబర్ 14416, ను స్కూల్ ఆవరణలో లో ప్రదర్శించారు.

Sthanikam

మానసిక ఆరోగ్యంతోనే నాణ్యమైన విద్య- సుధీర్, జిల్లా మానసిక ఆరోగ్య కౌన్సిలర్ ఎస్.ఎస్.ఏ. ఏలూరు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News