Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

మామిడాల జగదీష్ కుమార్ కు పద్మశ్రీ

మామిడాల జగదీష్ కుమార్ కు పద్మశ్రీ

మామిడాల జగదీష్ కుమార్ కు పద్మశ్రీ
25-01-2026 171 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

నల్గొండ ముద్దుబిడ్డకు పద్మశ్రీ

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, యూజీసీ మాజీ చైర్మన్‌, జేఎన్‌యూ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ మామిడాల జగదీష్‌ కుమార్‌కు పద్మశ్రీ అవార్డు దక్కింది. లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రకటించింది.

దేశంలోని ఉన్నత విద్య రంగంలో సంస్కరణలకు ఆయన చేసిన కృషి విశేషమని కేంద్రం పేర్కొంది. యూజీసీ చైర్మన్‌గా, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌గా విధులు నిర్వర్తించిన సమయంలో విద్యా ప్రమాణాల పెంపు, పరిశోధనలకు ప్రోత్సాహం, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై జగదీష్‌ కుమార్‌ ప్రత్యేక దృష్టి సారించారు.

సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి జాతీయ స్థాయి గౌరవం అందుకోవడం నల్గొండ జిల్లాకు గర్వకారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. పద్మశ్రీ ప్రకటించడంతో మామిడాల గ్రామంతో పాటు జిల్లావ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Sthanikam

మామిడాల జగదీష్ కుమార్ కు పద్మశ్రీ

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News