Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ తేవాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 05:28 PM

మళ్లీ సూర్యాపేటను పాత రోజులకు నెట్టిన కాంగ్రెస్ పాలన

04-02-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూర్యాపేట మళ్లీ పాత దుస్థితికి చేరిందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 22వ వార్డులో బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మోత్కూరి దుర్గమ్మ ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎమ్మెల్యేగా తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వేల కోట్ల నిధులు తీసుకొచ్చి సూర్యాపేటను అభివృద్ధి పథంలో నడిపామని అన్నారు. కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాల హయాంలో తాగునీరు, విద్యుత్, రోడ్ల సమస్యలతో ప్రజలు నరకయాతన అనుభవించారని, బిఆర్ఎస్ పాలనలో వాటన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపామని చెప్పారు. అప్పట్లో దౌర్జన్యాలు లేని సూర్యాపేటలో ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ దందాలు పరిస్థితులు మొదలయ్యాయని ఆరోపించారు. ప్రజలకు ఇది మంచి అవకాశం అంటూ, ఓటుతోనే కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు మోత్కూరి సందీప్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, అంతటి విజయ్ కుమార్, శ్రీనివాస్, గుంటి సైదులు, బండారి సతీష్, బందు ఉపేందర్, గుణగంటి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మళ్లీ సూర్యాపేటను పాత రోజులకు నెట్టిన కాంగ్రెస్ పాలన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News