Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:09 PM

మల్లన్న బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – ఎస్‌ఐ డి నాగరాజు

15-02-2026 783 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, నిదానపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు భక్తి వైభవంతో ప్రారంభంకానున్నాయి. చిన్న శ్రీశైలం గా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆదివారం రామన్నపేట ఎస్‌ఐ డి నాగరాజు సమగ్రంగా పరిశీలించారు.

బ్రహ్మోత్సవాల తొలి రోజు రాత్రి జాగారాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనుండగా, మరుసటి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగనుంది. అనంతరం మరుసటి రోజు తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.

వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, రద్దీని నియంత్రించేందుకు వాలంటీర్లు, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ డి నాగరాజు ఆలయ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ యాదవ్‌కు సూచించారు. పార్కింగ్, తాగునీరు, విద్యుత్ వెలుగులు, క్యూ లైన్ల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కడారి అంగడియ్య, భాష మల్ల బాలరాజు, సంకు స్వామి, నాయకులు గుత్త నర్సింహారెడ్డి, కొండ మల్లేశం గౌడ్, తిమ్మాపురం మహేందర్ రెడ్డి, వర్కల వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మల్లన్న బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – ఎస్‌ఐ డి నాగరాజు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News