Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:17 PM

మల్కాజ్‌గిరి అభివృద్ధిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

28-12-2025 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మల్కాజ్‌గిరి | స్థానికం

మల్కాజ్‌గిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. గోపాల్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో, ఉత్తమ్‌నగర్ నుంచి జ్యోతి నగర్ వరకు ఉన్న వివిధ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు బాక్స్ డ్రైన్లు, త్రాగునీరు, ట్రాఫిక్ సమస్యలు, ఆర్‌యూబీ నిర్మాణం, పారిశుద్ధ్యం, డ్రైనేజీ ఓవర్‌ఫ్లో తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

గౌతమ్‌నగర్ త్రాగునీటి సమస్యకు మహేంద్రహిల్స్‌లో రూ.15 కోట్లతో వాటర్ రిజర్వాయర్, ఏఓసీ 100 అడుగుల రోడ్లు రూ.900 కోట్లతో అభివృద్ధి, గౌతమ్‌నగర్–వాజ్‌పేయి నగర్ ఆర్‌యూబీలు ఒక్క ఇల్లు కోల్పోకుండా నిర్మాణం, విద్యుత్ శాఖ ద్వారా రూ.42 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.

ఈ సమావేశంలో పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా, నాయకులు, కార్పొరేటర్, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మల్కాజ్‌గిరి అభివృద్ధిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

Article Image

మల్కాజ్‌గిరి | స్థానికం

మల్కాజ్‌గిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. గోపాల్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో, ఉత్తమ్‌నగర్ నుంచి జ్యోతి నగర్ వరకు ఉన్న వివిధ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు బాక్స్ డ్రైన్లు, త్రాగునీరు, ట్రాఫిక్ సమస్యలు, ఆర్‌యూబీ నిర్మాణం, పారిశుద్ధ్యం, డ్రైనేజీ ఓవర్‌ఫ్లో తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

గౌతమ్‌నగర్ త్రాగునీటి సమస్యకు మహేంద్రహిల్స్‌లో రూ.15 కోట్లతో వాటర్ రిజర్వాయర్, ఏఓసీ 100 అడుగుల రోడ్లు రూ.900 కోట్లతో అభివృద్ధి, గౌతమ్‌నగర్–వాజ్‌పేయి నగర్ ఆర్‌యూబీలు ఒక్క ఇల్లు కోల్పోకుండా నిర్మాణం, విద్యుత్ శాఖ ద్వారా రూ.42 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.

ఈ సమావేశంలో పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా, నాయకులు, కార్పొరేటర్, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News