Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

మల్గి గ్రామంలో కెమికల్ పరిశ్రమ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఐఎన్‌హెచ్‌ఆర్‌పీసీ పిలుపు

Updated : 02 Jan 2026 20:16 IST
As Preferred Source 1 min read
మల్గి గ్రామంలో కెమికల్ పరిశ్రమ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఐఎన్‌హెచ్‌ఆర్‌పీసీ పిలుపు

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో న్యాల్కల్ మండలం మల్గి గ్రామం సమీపంలో కెమికల్ కంపెనీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం రేపు (జనవరి 3, 2026) ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించనున్నట్లు ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ డిగ్గే బాబు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి కెమికల్ కంపెనీల వల్ల పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్యం, జీవనాధారాలు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందన్నారు. గాలి, నీరు, మట్టి తీవ్రంగా కాలుష్యం చెంది ప్రజలు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే మల్గి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ కంపెనీ ఏర్పాటుకు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

ప్రజల హక్కులు, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఎప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుందని డాక్టర్ డిగ్గే బాబు స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు తమ మద్దతును కోరుతున్న నేపథ్యంలో, సంగారెడ్డి జిల్లా మరియు రాష్ట్ర స్థాయి ఐఎన్‌హెచ్‌ఆర్‌పీసీ సభ్యులు అందరూ రేపు జరిగే ప్రజాభిప్రాయ సేకరణ సమావేశానికి హాజరై కెమికల్ కంపెనీకి వ్యతిరేకంగా శాంతియుత నిరసన తెలుపుతూ ప్రజలకు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

“ప్రజల ఆరోగ్యం, జీవన హక్కులను కాపాడటం మన బాధ్యత. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించకుండా అభివృద్ధి పేరుతో కాలుష్యాన్ని మోపడం అన్యాయం” అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజల గొంతుకను బలంగా వినిపించాలని ఆయన కోరారు.

Sthanikam

మల్గి గ్రామంలో కెమికల్ పరిశ్రమ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఐఎన్‌హెచ్‌ఆర్‌పీసీ పిలుపు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news