Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:35 AM

మాకు న్యాయం చేయండి మహా ప్రభో

మాకు న్యాయం చేయండి మహా ప్రభో

మాకు న్యాయం చేయండి మహా ప్రభో
23-02-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రైతు లక్ష్మీదేవమ్మతో పాటు కుమారుడు డేరంగుల శ్రీనివాసులు జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒడిసి మండలంలోని సున్నంపల్లి గ్రామ పొలంలో సర్వేనెంబర్ 1006-1 లో 4 ఎకరాల 37 సెంట్లు భూమిని, 1987 సంవత్సరంలో తన తండ్రి గారైన డేరంగుల రంగప్ప పేరుమీద ప్రభుత్వం డి.పట్టా మంజూరు చేసిందన్నారు.అప్పటినుంచి ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో నాకు ఉన్న మొత్తం 4-37 ఎకరాల భూమిలో 1-47 ఎకరాలు భూమిని ఓడిసి మండల రెవెన్యూ అధికారులు రికార్డులు తారుమారు చేసి ఇతరుల పేరు మీదికి ఆన్లైన్ చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తన తండ్రి రంగప్ప అన్యాక్రాంతమైన తమ భూమిని తమ పేరు మీద ఎక్కించాలని గత 10 సంవత్సరాల నుంచి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లకు చెప్పులు అరిగేలా తిరిగి తిరిగి చివరకు మరణించారని శ్రీనివాస్ తెలిపారు.ప్రస్తుతం మూడేళ్ల నుంచి మండల మరియు డివిజన్ రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూ కొంతమంది అధికారులకు ఆమ్యామ్యాలు అందజేసిన కూడా ఫలితం లేకుండా పోయిందని ఆరోపించారు.కావున కలెక్టర్ మా భూమిపై ఆన్లైన్ లో వున్న ఇతరుల పేరును తొలగించి, మాభూమి మాకు ఆన్లైన్లో పొందుపరిచి పాసుబుక్కు మంజూరు అయ్యేవిధంగా న్యాయం చేయాలని కోరారు.

Sthanikam

మాకు న్యాయం చేయండి మహా ప్రభో

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News