Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:53 PM

మాజీ మంత్రులపై నోటీసుల విషయంలో వ్యతిరేక అభిప్రాయాలు

22-01-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

బిఆర్ఎస్ పార్టీ నూతన క్యాలెండర్ ఆవిష్కరణం

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ నూతన క్యాలెండర్ మరియు డైరీని ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యుడు మహారెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, భారత రాష్ట్ర సమితి నాయకత్వాన్ని బలహీనపరిచే శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుపై జరుగుతున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని అన్నారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.మాజీ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడం అన్యాయమని, రాజకీయ కక్షతో తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ నోటీసుల్లో ఎలాంటి బలం లేదని, వీటి ద్వారా బిఆర్ఎస్ నాయకులను ఏమీ చేయలేరని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, తగిన సమయంలో సరైన తీర్పు ఇస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్, వైస్ చైర్మన్ పరశురాం, పట్టణ పార్టీ అధ్యక్షుడు నగేష్ సెట్, మాజీ ఎంపీటీసీ ముజామిల్, మండల పార్టీ అధ్యక్షుడు సంజీవ్ రావు పాటిల్, పండరి, మాజీ మండల సహకరణ సభ్యుడు నవాబ్, మాజీ మున్సిపల్ సహకరణ సభ్యుడు అంబదాస్, సర్పంచులు వెంకటేశం, సిద్ధూ, గణపతి, లక్ష్మణ్ నాయక్, నాయకులు నర్సింలు యాదవ్,సంజీవ్ కుమార్, శివకుమార్,సద్దాం,శ్రీధర్ రెడ్డి, అబ్బు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మాజీ మంత్రులపై నోటీసుల విషయంలో వ్యతిరేక అభిప్రాయాలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News