Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

మాజీ ఎమ్మెల్యే,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్‌కు శాలువాలతో సన్మానం

Updated : 02 Feb 2026 18:17 IST
As Preferred Source 1 min read
మాజీ ఎమ్మెల్యే,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్‌కు శాలువాలతో సన్మానం

నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్ గిద్ద మండలం ఇరాక్ పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకుడు, న్యాయవాది తులసీరామ్ నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన మాజీ శాసనసభ్యుడు మహారెడ్డి భూపాల్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రతి తండాను గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడం, తండాలకు త్రాగునీటి సౌకర్యం కల్పించడం, రవాణా సౌకర్యాల కోసం బీటి రహదారుల నిర్మాణానికి కృషి చేయడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినందుకు ఆయన ప్రశంసలు తెలిపారు. అలాగే వెనుకబడిన గిరిజన సోదరులు విద్యలో ముందుండేలా గిరిజన గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం, గిరిజనులకు రిజర్వేషన్ల కల్పనలో కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు.గిరిజనుల అభ్యున్నతికి రామ్ రావు మహారాజు ట్రస్ట్ నిర్మాణం కోసం ఇరవై గుంటల స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయడంలో చూపిన దూరదృష్టికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి దోహదపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ సభ్యురాలు లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్, మాజీ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు ఉబేద్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మాజీ ఎమ్మెల్యే,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్‌కు శాలువాలతో సన్మానం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news