Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:01 PM

మాజీ సర్పంచ్ రమేష్ పటేల్ ప్రార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన జీఎంఆర్

20-02-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలం సీనియర్ నాయకుడు, సుక్కల్తిర్త్ గ్రామ మాజీ సర్పంచ్ రమేష్ పటేల్ మరణ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుర్రపు మచ్చేందర్ వారి నివాసానికి చేరుకొని ప్రార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.అనంతరం మాట్లాడుతూ తక్కువ కాలం సాన్నిహిత్యం ఉన్నప్పటికీ మంచి మిత్రుడిని కోల్పోయిన బాధ కలిగిందన్నారు. ఒక్కగానొక్క తనయుడు తండ్రిని కోల్పోయిన దృశ్యం హృదయాన్ని కలచివేసిందని తెలిపారు. యువ నాయకుడిగా, ప్రజల సమస్యలపై కట్టుబాటుతో పనిచేసే మంచి నాయకత్వాన్ని కోల్పోయామని పేర్కొన్నారు. రమేష్ పటేల్ సేవలు గ్రామ ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఈ దుఃఖాన్ని భరించే ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. గ్రామాభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సాగర సంగం గౌరవ అధ్యక్షుడు కృష్ణాపూర్ మాజీ ఎంపీటీసీ అంజయ్య సాగర్, మాజీ సర్పంచ్లు సిద్దు, పుండ్లిక్, విజయ్ రావు, సాయిలు, సురేందర్ పటేల్, నాయకులు సంతోష్ రావు పటేల్, జీవన్ రావ్ పటేల్, శంకర్, సాగర్, సాయిలు, రామ్ దాస్, మండల పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మాజీ సర్పంచ్ రమేష్ పటేల్ ప్రార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన జీఎంఆర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News