Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో నేమ్ ప్లేట్ మార్పు చేయాలి

28-12-2025 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖకు వినతి

మిర్యాలగూడ (స్థానిక ప్రతినిధి):

మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకునే రైలు ప్రయాణికులు, ముఖ్యంగా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వారు స్టేషన్ పేరు స్పష్టంగా కనిపించక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో స్టేషన్‌లో ఏర్పాటు చేసిన నేమ్ ప్లేట్లను ఆధునికంగా, పెద్ద అక్షరాలతో, స్పష్టంగా కనిపించే విధంగా మార్చి కొత్తగా ఏర్పాటు చేయాలని రైల్వే డిపార్ట్మెంట్‌ను స్థానికులు కోరుతున్నారు.

ప్రస్తుతం ఉన్న బోర్డులు కొన్నిచోట్ల మసకబారిపోవడం, అక్షరాలు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల రాత్రి సమయాల్లోనే కాకుండా పగటి వేళల్లో కూడా ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, తొలిసారి మిర్యాలగూడకు వచ్చే ప్రయాణికులు స్టేషన్ గుర్తించడంలో ఇబ్బందులు పడుతున్నారని వారు వాపోతున్నారు.

కావున రైల్వే అధికారులు స్పందించి, మిర్యాలగూడ రైల్వే స్టేషన్ పేరు అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో, ప్రవేశ ద్వారాల వద్ద, రైళ్లు నిలిచే ప్రాంతాల్లో పెద్ద అక్షరాలతో, తెలుగు–ఇంగ్లీష్ భాషల్లో స్పష్టంగా కనిపించేలా నేమ్ ప్లేట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ప్రయాణికుల సౌకర్యానికి ఎంతో దోహదపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Sthanikam

మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో నేమ్ ప్లేట్ మార్పు చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News