Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చి.. కుమారుడిని కోల్పోయిన తల్లి! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 05:07 PM

మైరా మురిపెంలో… పరమశివుని చెంత మంత్రి పొంగులేటి దంపతులు

15-02-2026 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మహాశివరాత్రి వేళ తీర్థాల, కూసుమంచి, బెండాలపాడు క్షేత్రాల్లో కుటుంబ సమేతంగా పూజలు

వేద ఆశీర్వచనాల మధ్య ఘన స్వాగతం

ఖమ్మం : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో భక్తి వాతావరణం నెలకొంది. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాధురి దంపతులు తమ ముద్దుల మనుమరాలు మైరాతో కలిసి ఆదివారం ఆధ్యాత్మిక పర్యటన చేపట్టారు. పసిప్రాయంలోనే భక్తి భావంతో స్వామివారిని దర్శించుకుంటున్న మైరా మురిపెంలో మంత్రి కుటుంబ సభ్యులు ఆధ్యాత్మికంలో మునిగితేలారు.

తీర్థాల సంగమేశ్వరుని దర్శనం

మంత్రి కుటుంబం తొలుత ఖమ్మం రూరల్ మండలం తీర్థాలలోని శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం ను దర్శించుకుంది. త్రివేణి సంగమ క్షేత్రంలో వెలసిన స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. పూర్ణకుంభ స్వాగతంతో ఆలయ అధికారులు మంత్రి దంపతులను ఆహ్వానించి శేషవస్త్రాలతో సత్కరించారు.

కూసుమంచి గణపేశ్వరుని సన్నిధిలో

అనంతరం కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన శ్రీ గణపేశ్వర స్వామి ఆలయం లో స్వామివారిని దర్శించుకున్నారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య విశేష పూజల్లో పాల్గొని ఆశీర్వచనాలు స్వీకరించారు.

బెండాలపాడు వీరభద్రుడికి నీరాజనం

పర్యటనలో భాగంగా చండ్రుగొండ మండలం బెండాలపాడులోని శ్రీ వీరభద్రస్వామి ఆలయం ను సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు ఆత్మీయ స్వాగతం పలికారు. వీరభద్రుడి సన్నిధిలో నిర్వహించిన విశేష పూజల్లో మంత్రి దంపతులు, చిన్నారి మైరా పాల్గొన్నారు.

రాష్ట్ర సుభిక్షత కోసం ప్రార్థనలు

దర్శనానంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, “మహాశివరాత్రి పర్వదినాన రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో విరాజిల్లాలని, తెలంగాణ రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆ పరమశివుడిని ప్రార్థించాను” అని తెలిపారు.

ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహాశివరాత్రి వేళ మంత్రి కుటుంబం చేపట్టిన ఈ ఆధ్యాత్మిక పర్యటన భక్తుల్లో విశేష ఆసక్తిని కలిగించింది.

Sthanikam

మైరా మురిపెంలో… పరమశివుని చెంత మంత్రి పొంగులేటి దంపతులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News