Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 12:00 AM

మైనారిటీ కౌన్సిలర్లకు ఆత్మీయ సన్మానం

మైనారిటీ కౌన్సిలర్లకు ఆత్మీయ సన్మానం

మైనారిటీ కౌన్సిలర్లకు ఆత్మీయ సన్మానం
18-02-2026 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వైస్ చైర్మన్ షఫీ ఉల్లా సహా పలువురికి ఘన గౌరవం

పట్టణానికి చెందిన మైనారిటీ సీనియర్ జర్నలిస్టులు మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా మరియు పలువురు నూతనంగా ఎన్నుకోబడిన వార్డు కౌన్సిలర్లను ఆత్మీయంగా సన్మానించారు. ఎలాంటి భారీ సభలు నిర్వహించకుండా, సాదాసీదా వాతావరణంలో పరస్పర గౌరవంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ షఫీ ఉల్లాకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సత్కరించారు. అలాగే 2వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ తన్వీర్ హుస్సేన్, 16వ వార్డు కౌన్సిలర్ షేక్ జహీర్, 34వ వార్డు కౌన్సిలర్ తాహెర్ బిన్ మన్సూర్, 36వ వార్డు కౌన్సిలర్ షేక్ మన్సూర్ బి (ఫారుక్)లను కూడా సన్మానించారు. మైనారిటీ సీనియర్ జర్నలిస్టులు జహంగీర్, రషీద్, ఎస్‌కే పాషా, జహీర్, నజీర్ ఖాన్ తదితరులు మాట్లాడుతూ మైనారిటీ వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం లభించడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ప్రజాప్రతినిధులను అభినందించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం మీడియా బాధ్యత అయితే, ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసే నాయకులను ప్రోత్సహించడం కూడా తమ కర్తవ్యమేనని తెలిపారు.

Sthanikam

మైనారిటీ కౌన్సిలర్లకు ఆత్మీయ సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News