Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:25 AM

మైనారిటీ విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం

17-05-2026 84 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో కర్నూలులో నిర్వహిస్తున్న “తాలీమ్-ఎ-హునర్ టాలెంట్ టెస్ట్”కు హాజరవుతున్న మైనారిటీ విద్యార్థుల కోసం ఆదోని నియోజకవర్గం నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.

ఆదోని టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కె. మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ సీనియర్ నాయకుడు కె. ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో 150 మంది ముస్లిం విద్యార్థులు, విద్యార్థినులకు బస్సులు, భోజన వసతులు కల్పించారు.

ఈ సందర్భంగా యువ నాయకుడు కొంకా సిద్ధార్థ నాయుడు మైనారిటీ నాయకులతో కలిసి విద్యార్థులకు జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల విద్యా పురోగతి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు కె.యం.డి. అల్తాఫ్ హుస్సేన్, కర్నూలు పార్లమెంట్ టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు అప్సర్ భాషతో పాటు పలువురు మైనారిటీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

మైనారిటీ విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News