Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:59 AM

మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట

మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట

మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట
25-01-2026 136 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఏఐసీసీ సభ్యుడు రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.వారు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. మైనార్టీలు, పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పోతు భాస్కర్, పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News