Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:45 AM

మైలవరంలో మకిలి పట్టిన మధ్యాహ్న భోజనం – విద్యార్థుల ఆగ్రహం

11-03-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని తారకరామానగర్ ప్రాథమిక పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాచిపట్టిన అన్నం, నాసిరకం ఆహారం అందించడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లేట్లలో వడ్డించిన భోజనం తినలేమంటూ చిన్నారులు ఆహారాన్ని డస్ట్‌బిన్‌లలో పారబోసి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు పాఠశాల వద్దకు చేరుకుని వంట ఏజెన్సీ నిర్వాహకులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా “సార్… మా ఆహారం బాగోలేదు. మాకు మంచి భోజనం పెట్టించండి సార్” అంటూ చిన్నారులు వేడుకోవడం అక్కడ ఉన్న వారిని కలచివేసింది. పిల్లల ఆవేదన చూసి పోలీసులు కూడా భావోద్వేగానికి గురయ్యారు.

ఇదిలా ఉండగా, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని విషయంపై ప్రశ్నించగా, తాను పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వంట ఏజెన్సీ నిర్వాహకులు తన మాటలను పట్టించుకోవడం లేదని ఆమె తెలిపారు.

ఈ ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలా చూడాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

మైలవరంలో మకిలి పట్టిన మధ్యాహ్న భోజనం – విద్యార్థుల ఆగ్రహం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News