Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:53 PM

మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి – జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి – జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి – జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
January 25, 2026 08:14 PM 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

మహిళా సంఘాల సభ్యులు వ్యాపారవేత్తలుగా ఎదిగి ఆర్థికంగా స్వావలంబన సాధించి సమాజంలో ఉన్నతంగా రాణించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు.మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి లక్ష్యంగా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన మరియు విక్రయ మేళాను ‘మహిళా సంఘాల జాతర’ పేరుతో ఆదివారం నారాయణఖేడ్ రైతు వేదికలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజీవరెడ్డి కలిసి ప్రారంభించారు.ఈ మేళా రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను పరిశీలించారు. ఆయా ఉత్పత్తుల తయారీ విధానం, నాణ్యత, విక్రయ విధానాలు, మార్కెటింగ్ అవకాశాలపై మహిళలతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా సంఘాల ఆర్థిక ప్రగతిని ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన నాణ్యమైన ఉత్పత్తులను ఒకే వేదికపై ప్రదర్శించి విక్రయించే విధంగా ఈ మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రుణాలు పొందిన మహిళలు స్వంత వ్యాపారాలు ప్రారంభించి స్థిర ఆదాయం సాధిస్తున్న విధానాన్ని ప్రజలకు తెలియజేయడమే ఈ మేళా ప్రధాన ఉద్దేశమన్నారు.నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల మహిళా సంఘాల ఉత్పత్తులు ఈ మేళాలో ప్రదర్శించబడుతున్నాయని, ఇతర మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా సేర్ఫ్, మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు.నాణ్యమైన ఉత్పత్తులను కొనుగోలు చేసి మహిళలకు చేయూతనివ్వాలని ప్రజలను కోరారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు సంజీవరెడ్డి మాట్లాడుతూ, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వడ్డీ లేని రుణాలు, బ్యాంకు అనుసంధానం ద్వారా మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం అందించి వివిధ వ్యాపారాల్లో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.మహిళలు సేంద్రియ పంటలు, కూరగాయల సాగు, దుస్తుల తయారీ, ఆహార పదార్థాల తయారీలో మంచి నైపుణ్యం కనబరుస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఉత్పత్తుల ప్యాకింగ్, గుర్తింపు చిహ్నాలు, పెద్ద ఎత్తున విక్రయాలపై మరింత దృష్టి సారిస్తే ఆదాయం ఇంకా పెరుగుతుందని, అందుకు అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. రుణాలు పొందిన మహిళా సంఘాల సభ్యులు ఇతర అవసరాలకు వినియోగించకుండా స్వంత వ్యాపారాలపై పెట్టుబడి పెట్టి స్థిర ఆదాయం పొందే దిశగా ముందుకు సాగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఉప కలెక్టర్ ఉమా హారతి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ సూర్యారావు, తహసిల్దార్లు, సహాయక ప్రాజెక్టు మేనేజర్లు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News