Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:19 AM

మ‌హిళ‌లు ఎంట‌ర్ ప్రెన్యూర్స్ గా రాణించేందుకు కామ‌న్ ఫెసిలిటీ సెంట‌ర్స్ ఏర్పాటు చేస్తాము : విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్

మ‌హిళ‌లు ఎంట‌ర్ ప్రెన్యూర్స్ గా రాణించేందుకు కామ‌న్ ఫెసిలిటీ సెంట‌ర్స్ ఏర్పాటు చేస్తాము : విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్

మ‌హిళ‌లు ఎంట‌ర్ ప్రెన్యూర్స్ గా రాణించేందుకు కామ‌న్ ఫెసిలిటీ సెంట‌ర్స్ ఏర్పాటు చేస్తాము : విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్
February 17, 2026 11:10 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

విజయవాడ ఎన్.ఐ.ఆర్.డి లో శిక్ష‌ణ పొందిన మ‌హిళ‌ల‌తో ఎంపీ స‌మావేశం

ఈ స‌మావేశానికి హ్యాండ్ మేడ్ పేప‌ర్ ప్రొడ‌క్ట్స్, హోమ్ బేస్ట్ ప్రొడ‌క్ట్స్ , బ్రిక్స్ త‌యారీ పై శిక్ష‌ణ పొందిన మ‌హిళ‌లు హాజ‌రు

విజ‌య‌వాడ : కేశినేని ఫౌండేష‌న్ ద్వారా హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి లో స్వ‌యం ఉపాధికి సంబంధించి నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణ పొందిన మ‌హిళ‌లు ఎంట‌ర్ ప్రెన్యూర్స్ గా రాణించేందుకు కామ‌న్ ఫెసిలిటీ సెంట‌ర్స్ ఏర్పాటు చేయ‌టంతోపాటు మార్కెటింగ్ ప‌రంగా కూడా పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ తెలిపారు.

గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్ లో మంగ‌ళ‌వారం ఎంపీ కేశినేని శివ‌నాథ్ హ్యాండ్ మేడ్ పేప‌ర్ ప్రొడ‌క్ట్స్, హోమ్ బేస్ట్ ప్రొడ‌క్ట్స్ , బ్రిక్స్ త‌యారీ పై శిక్ష‌ణ పొందిన మూడు గ్రూపుల మ‌హిళ‌ల‌తో గ్రూపుల వారీ గా విడివిడిగా స‌మావేశం అయ్యారు. మ‌హిళ‌లు తాము త‌యారు చేసిన వ‌స్తువుల‌ను ఎంపీ కేశినేని శివ‌నాథ్ కి చూపించారు. ఆ వస్తువుల నాణ్య‌త‌, భ‌ద్ర‌త ల కోసం తీసుకున్న జాగ్ర‌త్త‌ల గురించి ఎంపీ కేశినేని శివ‌నాథ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా శిక్ష‌ణ పొందిన మ‌హిళ‌లు త‌మ‌కి రా మెటీరియ‌ల్ కొనుగోలు విష‌యంలో, మార్కెటింగ్ ప‌రంగా, మెషిన‌రీ కి సంబంధించి స‌హ‌కారం అందించాల‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను కోరారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ శిక్ష‌ణ పొంది వ‌స్తువులు త‌యారు చేస్తున్న మ‌హిళ‌ల‌కు మ‌రింత‌గా ప్రోత్స‌హ‌కం అందించే విధంగా తాము చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. . ఒకే ర‌క‌మైన వ‌స్తువులు త‌యారు చేసే వారంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే విధంగా కామ‌న్ పెసిలిటీ సెంట‌ర్స్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ కామ‌న్ ఫెసిలిటీ సెంట‌ర్స్ ను ఏర్పాటు చేయ‌టానికి వేగవంతంగా చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్లు వివరించారు. అలాగే త‌యారు చేసిన వ‌స్తువుల‌కు మార్కెటింగ్ క‌ల్పించే విధంగా..వారు ఆర్థికంగా మ‌రింత ఉన్న‌త స్థానంలో వుండే విధంగా కావాల్సిన సదుపాయాలు క‌ల్పించటంతో పాటు , ఎటువంటి స‌హాయ స‌హ‌కారాలు అందించ‌టానికైనా ముందు వుంటామ‌ని తెలిపారు. ఇంటి ఒక ఎంట‌ర్ ప్రెన్యూర్ వుండాల‌న్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశయాన్ని స్పూర్తిగా తీసుకుని మ‌హిళ‌ల‌ను ఎంట‌ర్ ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దేందుకు కేశినేని ఫౌండేష‌న్ ద్వారా ఎన్.ఐ.ఆర్.డి లో ప‌లు విభాగాల్లో శిక్ష‌ణ ఇప్పించ‌టం జ‌రిగింద‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎన్.ఐ.ఆర్.డి అధికారి ముర‌ళీకృష్ణ‌, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి రూర‌ల్ కో ఆర్డినేట‌ర్ సొంగా సంజ‌య్ వ‌ర్మ, న్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి అర్బ‌న్ కో ఆర్డినేట‌ర్ వ‌ల్ల‌భ‌నేని న‌రసింహాచౌద‌రి, ఎన్టీఆర్ జిల్లా స‌మైక్య

అధ్య‌క్షురాలు కందుల క‌ల్ప‌న‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌ల‌క్ష్మీ, విజ‌య‌వాడ రూర‌ల్ స‌మైక్య అధ్య‌క్షురాలు సుహాసిని, సెక్ర‌ట‌రీ విజ‌య‌ల‌క్ష్మీ ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News