Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి-చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

11-03-2026 242 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కుట్టు, ఎంబ్రాయిడరీ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని చౌటుప్పల్ పురపాలిక చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కల్పన కోసం టైలరింగ్, ఎంబ్రాయిడరీలో శిక్షణ పొందిన మహిళలకు బుధవారం లయన్స్ క్లబ్ భవనంలో ఆమె చేతుల మీదుగా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ అధ్యక్షుడు తిరందాసు జగన్నాథం అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మొగుదాల పావని మాట్లాడుతూ మహిళల్లో అపారమైన శక్తి సామర్థ్యాలు దాగి ఉంటాయని తెలిపారు. మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. శిక్షణ పొందిన మహిళలు స్వయం ఉపాధి ఏర్పరుచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.రామానంద తీర్థ గ్రామీణ సంస్థ డైరెక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ కుట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన మహిళలకు అందజేసిన సర్టిఫికెట్ల ద్వారా బ్యాంకుల నుంచి రుణ సదుపాయం పొందుతూ స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. తమ సంస్థలో నైపుణ్యాన్ని పెంచుకునేందుకు మరింత శిక్షణను ఉచితంగా అందిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ పోలోజు శ్రీనివాసాచారి, ట్రస్ట్ సెక్రటరీ మొగుదాల రమేష్, సేవా సెక్రటరీ అతహర్ పాష, ట్రెజరర్ సిలివేరు మంగయ్య, సభ్యులు ఉప్పు ఆంజనేయులు, నాంపల్లి రమేష్, కొసనం రామ్ రెడ్డి, బత్తిని రఘు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి-చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News