Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:19 PM

మహిళల అభ్యున్నతే చంద్రబాబు లక్ష్యం: మంత్రి సవిత

09-03-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి/పెనుకొండ : మహిళల అభ్యున్నతే సీఎం నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్‌. సవిత అన్నారు. పెనుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.

మహిళలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు మరియు సీఎం చంద్రబాబు నాయుడుదేనని తెలిపారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించిన ఎన్టీఆర్, విద్యా–ఉద్యోగాల్లో 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి ఆర్థిక స్వావలంబన సాధించేలా చర్యలు తీసుకున్నారన్నారు.

దీపం పథకాల ద్వారా మహిళల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లారని, స్త్రీ విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఇంటిలో ఉన్న ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున అందజేస్తున్నామని తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ పార్కుల్లో వారికి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. పెనుకొండ ప్రాంతంలో ఎక్కువ మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.

భారీగా తరలొచ్చిన మహిళలు

పేనుకొండలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు నియోజకవర్గం నలుమూలల నుంచి నాలుగు వేల మందికి పైగా మహిళలు హాజరయ్యారు. వచ్చిన మహిళలకు మంత్రి సవిత చీరలు, గాజులతో పాటు పసుపు–కుంకుమలను పంపిణీ చేశారు.

అంతకుముందు తన తండ్రి ఎస్‌. రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బస్ షెల్టర్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ర్యాలీగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకున్నారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా సంఘాల స్టాళ్లను సందర్శించి మహిళలను అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, సతీష్ కుమార్, ఇతర అధికారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మహిళల అభ్యున్నతే చంద్రబాబు లక్ష్యం: మంత్రి సవిత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News