Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:03 AM

మహిళా వ్యాపార నెట్‌వర్కింగ్ సమావేశం ఘనంగా నిర్వహణ

మహిళా వ్యాపార నెట్‌వర్కింగ్ సమావేశం ఘనంగా నిర్వహణ

మహిళా వ్యాపార నెట్‌వర్కింగ్ సమావేశం ఘనంగా నిర్వహణ
January 18, 2026 08:23 PM 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ:జహీరాబాద్ ప్రాంతం నుంచి మహిళల ఆవిష్కరణలు, వ్యాపార నైపుణ్యాలు వెలుగులోకి రావాలనే లక్ష్యంతో జహీరాబాద్‌లో మహిళా వ్యాపార నెట్‌వర్కింగ్ సమావేశం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి వివిధ గ్రామాల నుంచి సుమారు మూడు వందల మంది మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిప్రాయాలు, సమస్యలు, వ్యాపార ఆలోచనలను వెల్లడించారు.ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మాజీ మంత్రి డా. ఎ. చంద్రశేఖర్ మాట్లాడుతూ, సాధారణంగా పెద్ద పరిశ్రమలు మరియు భారీ వ్యాపారాలకు పెట్టుబడి పెట్టేందుకు అనేక ఆర్థిక సంస్థలు ముందుకు వస్తాయని తెలిపారు. కానీ చిన్న స్థాయిలో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి బ్యాంకు రుణాలే ప్రధాన ఆధారమవుతున్నాయని అన్నారు.

బ్యాంకు రుణాల కోసం పూచీకత్తుగా స్థిరాస్తులు చూపాల్సిన పరిస్థితి ఉండటంతో, అలాంటి ఆస్తులు లేని ఎంతో మంది మహిళలు మంచి వ్యాపార ఆలోచనలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయలేక ఆశలు వదులుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని, వ్యాపార రంగంలో తమను తాము నిరూపించుకోవాలనుకునే మహిళలకు ఆర్థికంగా అండగా నిలుస్తామని,అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం వై.ఎం.ఎస్.ఎఫ్ సామాజిక పారిశ్రామికవేత్త, నిర్వాహకురాలు అస్మా మాట్లాడుతూ, జహీరాబాద్ ప్రాంతంలోని మహిళల్లో ఉన్న నైపుణ్యాలను గుర్తించి వాటిని వ్యాపార అవకాశాలుగా మార్చడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యమని తెలిపారు.మహిళలు వ్యాపారం ప్రారంభించేందుకు అవసరమైన ప్రతి అంశంపై అవగాహన కల్పించడం, మార్కెట్‌కు సంబంధించిన అవకాశాలు, సవాళ్లు, వ్యాపార ప్రణాళికలను ఎలా తయారు చేయాలి, పెట్టుబడులను ఎలా సమకూర్చుకోవాలి వంటి విషయాలపై ఈ వేదిక ద్వారా వివరించామని చెప్పారు.ప్రతి మహిళలోనూ వ్యాపార ఆలోచనలు ఉన్నప్పటికీ అవి వ్యాపారంగా మారకపోవడమే ప్రధాన సమస్యగా పేర్కొన్నారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అవసరాలను గుర్తించి, ఆ అవసరాలనే ఆవిష్కరణలుగా మార్చుకుంటే మహిళలు స్వయం ఉపాధితో పాటు ఆర్థికంగా బలోపేతం అవుతారని అన్నారు.స్థానిక పరిశ్రమలకు అనుగుణంగా వ్యాపారాలను ప్రారంభిస్తే మహిళలకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. త్వరలోనే పరిశ్రమ యజమానులను సంప్రదించి మహిళలకు తగిన ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తామని, అలాగే నిష్టులో మహిళల ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసేలా పెద్దల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.ఈ సమావేశంలో పాల్గొన్న మహిళలు తమ అనుభవాలు,సమస్యలు, వ్యాపార ఆలోచనలను వేదికపై పంచుకోవడం విశేషంగా నిలిచింది.ఈ కార్యక్రమంలో

ఆత్మకమిటీ చైర్మన్ రామ లింగారెడ్డి, మొగుడంపల్లి మండల అధ్యక్షులు మక్సూద్ అహ్మద్, జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు కండెం నర్సిములు, న్యాల్కల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ అధ్యక్షులు అర్షద్ అలీ, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,

మహిళా నాయకులు మమత చంద్రకళ, స్వరూప, మారుణీ బాయి, చన్ను బీ, మల్లికా రెడ్డి, అరుణ, ఈశ్వరమ్మ, ఆసియా, తుల్జమ్మ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News