Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:46 AM

మహిళా శక్తితో 9వ వార్డులో కాంగ్రెస్ దూకుడు

మహిళా శక్తితో 9వ వార్డులో కాంగ్రెస్ దూకుడు

మహిళా శక్తితో 9వ వార్డులో కాంగ్రెస్ దూకుడు
February 05, 2026 07:00 PM 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బండారు మంగమ్మ వెంకన్న కి మద్దతుగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి , కొప్పుల వేణారెడ్డి ప్రచారం

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 9వ వార్డులోని బలహీన వర్గాల కాలనీలో మహిళా అభ్యర్థి బండారు మంగమ్మ వెంకన్న కి మద్దతుగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా బండారు మంగమ్మ వెంకన్న మహిళలు, వృద్ధులు, చిన్నారులతో నేరుగా మాట్లాడుతూ వార్డు సమస్యలను తెలుసుకున్నారు. మహిళల సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి , కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ పేదలు, బడుగు, బలహీన వర్గాల సమస్యలను బాగా అర్థం చేసుకునే నాయకురాలిగా బండారు మంగమ్మ వెంకన్న ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిపిందని తెలిపారు. మహిళా అభ్యర్థిని గెలిపిస్తే వార్డు అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు.ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ఈ సంక్షేమ పాలనను కొనసాగించాలంటే 9వ వార్డు మహిళా అభ్యర్థి బండారు మంగమ్మ వెంకన్నకి ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News