Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:26 AM

మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: న్యాల్కల్‌లో మహిళా కాంగ్రెస్ పోస్టుకార్డుల ఉద్యమం

14-05-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్, మహిళలకు రాజకీయాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాల్కల్ మండలం మీర్జాపూర్-బి గ్రామ పోస్టాఫీసు వద్ద మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోస్టుకార్డుల ఉద్యమం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోస్టుకార్డుల ద్వారా తమ డిమాండ్లను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మాట్లాడుతూ మహిళలు కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా, దేశ విధానాలను నిర్ణయించే స్థాయిలో కూడా భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న మహిళలకు కూడా ఉన్నత నిర్ణయాధికార పదవుల్లో సముచిత అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.దేశ జనాభాలో సగభాగం మహిళలేనని, వారికి రాజకీయాల్లో తగిన స్థానం కల్పించేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళా రిజర్వేషన్ చట్టంలో ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. రానున్న జూలై నెల పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును అమల్లోకి తీసుకురావాలని పోస్టుకార్డుల ద్వారా ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.మహిళా కాంగ్రెస్ న్యాల్కల్ మండల నాయకురాలు స్వరూప ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి స్నేహ, జహీరాబాద్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ కార్యదర్శి సురేఖ, మహిళా నాయకులు వహీదా బేగం, రేణుక, స్వప్న, అంబికా, కరిష్మా, గంగామణి, లలిత, మాధవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: న్యాల్కల్‌లో మహిళా కాంగ్రెస్ పోస్టుకార్డుల ఉద్యమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News