Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:29 AM

మహిళా ప్రజాప్రతినిధుల పట్ల చిన్నచూపు తగదు. ఎమ్మెల్యే, అధికార యంత్రాంగంపై సర్పంచ్ మమతారెడ్డి ఆగ్రహం

22-05-2026 320 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, :

మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ఎమ్మెల్యేలు, జిల్లా అధికార యంత్రాంగం చిన్నచూపుతో వ్యవహరించడం తగదని టేకుల సోమవారం గ్రామ సర్పంచ్ పడమటి మమతారెడ్డి హెచ్చరించారు.

శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ఆహ్వానం మేరకు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు పురుషులతో సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇకముందు మహిళా ప్రజాప్రతినిధులను అవమానించే పరిస్థితులను సహించబోమని స్పష్టం చేశారు.

మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, 33 శాతం రిజర్వేషన్లతో ప్రజల చేత ఎన్నుకోబడిన మహిళా ప్రజాప్రతినిధులకు పరిపాలనా అవకాశాలు వచ్చినప్పుడు అధికార యంత్రాంగం చిన్నచూపుతో వ్యవహరించడం బాధాకరమని ఆరోపించారు.

ఇకపై ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని ఆమె గుర్తు చేశారు.

Sthanikam

మహిళా ప్రజాప్రతినిధుల పట్ల చిన్నచూపు తగదు. ఎమ్మెల్యే, అధికార యంత్రాంగంపై సర్పంచ్ మమతారెడ్డి ఆగ్రహం

Article Image

భువనగిరి, :

మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ఎమ్మెల్యేలు, జిల్లా అధికార యంత్రాంగం చిన్నచూపుతో వ్యవహరించడం తగదని టేకుల సోమవారం గ్రామ సర్పంచ్ పడమటి మమతారెడ్డి హెచ్చరించారు.

శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ఆహ్వానం మేరకు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు పురుషులతో సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇకముందు మహిళా ప్రజాప్రతినిధులను అవమానించే పరిస్థితులను సహించబోమని స్పష్టం చేశారు.

మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, 33 శాతం రిజర్వేషన్లతో ప్రజల చేత ఎన్నుకోబడిన మహిళా ప్రజాప్రతినిధులకు పరిపాలనా అవకాశాలు వచ్చినప్పుడు అధికార యంత్రాంగం చిన్నచూపుతో వ్యవహరించడం బాధాకరమని ఆరోపించారు.

ఇకపై ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని ఆమె గుర్తు చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News