Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:40 AM

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం సీఐపై ఆరోపణలతో సస్పెన్షన్ నెల్లూరు జిల్లా సీతారామపురంలో ఘటన

10-02-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పోలీస్ స్టేషన్‌లోనే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన కానిస్టేబుల్ జ్యోతి మీడియా సమావేశంలో సీఐ వెంకట్రావుపై ఆరోపణలు చేసిన వైనం కానిస్టేబుల్ జ్యోతిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టిన అధికారులు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడటం, ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించి సీఐపై ఆరోపణలు చేయడంతో ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. ఇక్కడి పోలీస్ స్టేషన్‌‌లో జరిగిన పరిణామాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. వివరాల్లోకి వెళితే.. విధుల్లో నిర్లక్ష్యం, ఇతర ఆరోపణల నేపథ్యంలో సీతారాంపురం ఎస్ఐ శివకృష్ణారెడ్డిని ఉన్నతాధికారులు ఇటీవల సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో అదే పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న జ్యోతి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం గమనించిన సహచరులు ఆమెను వెంటనే వింజమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

చికిత్స అనంతరం ఆమె స్వగ్రామం ఉదయగిరికి వెళ్లి అక్కడ మీడియాతో మాట్లాడారు. ఉదయగిరి సీఐ వెంకట్రావు, ఇటీవల సస్పెన్షన్‌కు గురైన ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు ఎస్‌ఐతో వివాహేతర సంబంధం ఉందని సీఐ ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమె ఆరోపించారు. అందువల్లే ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి సస్పెన్షన్‌కు గురయ్యారని చెప్పారు. అయితే, ఎస్‌ఐపై తప్పుడు ఫిర్యాదులు చేసి అతని సస్పెన్షన్‌కు కారణమయ్యానని తనపైనే సీఐ నిందలు మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో సీఐ గత ఐదు నెలలుగా అవమానకరంగా మాట్లాడుతున్నారని, దీనిపై ప్రశ్నించినందుకు తనపై కక్షగట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వంపై తప్పుగా ప్రచారం జరుగుతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని ఆమె వెల్లడించారు. ఇదిలా ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా విలేకరుల సమావేశం నిర్వహించి సీఐ వెంకట్రావుపై నిరాధార ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆమెపై క్రమశిక్షణా చర్యలు చేపట్టారు. ఆమెను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ అనిత వేజండ్ల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామాలు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Sthanikam

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం సీఐపై ఆరోపణలతో సస్పెన్షన్ నెల్లూరు జిల్లా సీతారామపురంలో ఘటన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News