Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:22 AM

మహిళా హక్కుల కోసం ఉద్యమించాలి టి.అరుణ

మహిళా హక్కుల కోసం ఉద్యమించాలి టి.అరుణ

మహిళా హక్కుల కోసం ఉద్యమించాలి టి.అరుణ
09-03-2026 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి దుర్గం పూజిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరికల కళావతి, ఏఐసిటియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు టి.అరుణ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.హరినాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా టి.అరుణ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కేవలం వేడుకగా కాకుండా పురుషాధిక్య భావజాలానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నప్పటికీ మహిళల సాధికారతలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం, మహిళల హక్కుల పరిరక్షణలో ప్రభుత్వాలు బాధ్యత వహించడం లేదన్నారు.

ముగ్గురు పిల్లలను కనాలని సూచించే పాలకులు ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా జీవనోపాధి పథకాలు రూపొందించాలని కోరారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు.

ఇటీవల మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరుగుతున్నాయని, ఆయేషామేర ఘటనలో నిందితులను పట్టుకోకపోవడం బాధాకరమని దుర్గం పూజిత అన్నారు. నిర్భయ, దిశ చట్టాలు ఉన్నప్పటికీ మహిళలపై హింసను అరికట్టడంలో విఫలమవుతున్నాయని పరికల కళావతి ఆరోపించారు.

మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డి.హరినాథ్ డిమాండ్ చేశారు. సంఘటనల సమయంలో బాధితులకు న్యాయం చేయకుండా నిందితుల పక్షాన నిలబడటం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని దుర్గం పుల్లారావు విమర్శించారు.

ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు, కార్యకర్తలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.

Sthanikam

మహిళా హక్కుల కోసం ఉద్యమించాలి టి.అరుణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News