Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:24 AM

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల సందర్భంగా కమిటీ ఏర్పాటు

08-04-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి:ఈ నెల 11న జరగబోయే మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల సందర్భంగా భువనగిరి పట్టణంలోని చాళుక్య రాఘవేంద్ర హోటల్‌లో అన్ని రాజకీయ పార్టీల, కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జయంతి ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. జయంతి ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షురాలిగా భువనగిరి పట్టణ మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్‌ను నియమించారు. గౌరవ సలహాదారులుగా పొత్నక్ ప్రమోద్ కుమార్,అతికం లక్ష్మి నారాయణ గౌడ్,పెంట నరసింహ,సుర్వీ శ్రీనివాస్ గౌడ్,గొట్టిపముల బాబురావు, మాటూరి అశోక్,కొత్త బాలరాజు,మాటూరి బాలేశ్వర్‌ను ఎంపిక చేశారు. కన్వీనర్‌గా కొత్త నరసింహ స్వామిని నియమించారు.కో-కన్వీనర్లుగా దేవరకొండ నర్సింహ చారి,దరిపల్లి ప్రవీణ్ కుమార్,పంచేద్దుల బాల్ రామ్,పిట్టల బాలరాజు,సబంకర్ వెంకటేష్,బెండ శ్రీకాంత్, సిరికొండ శివకుమార్,యేషాల అశోక్,మాయ కృష్ణ,జిన్న మల్లేష్,కూర శివ కుమార్,రత్నపురం పద్మ,సిద్ధుల పద్మలను నియమించారు. ఈ సమావేశంలో అన్ని కుల సంఘాలు,అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లా కేంద్రంలో జరగబోయే ఈ కార్యక్రమానికి పార్టీలకతీతంగా బీసీ ప్రతినిధులు,బీసీ కుల సంఘాల నాయకులు,బీసీ విద్యార్థులు,ఉద్యోగులు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ బీసీ కులాలకు చెందిన నాయకులు,అన్ని రాజకీయ పార్టీల బీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల సందర్భంగా కమిటీ ఏర్పాటు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News