Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:48 AM

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా నిర్వహణ

11-04-2026 118 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సమానత్వం, విద్యా విస్తరణకు పూలే చూపిన మార్గం అనుసరించాలి – వట్టే జానయ్య యాదవ్

సూర్యాపేట: మహాత్మ మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని సూర్యాపేట జిల్లా రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ కోసం చేసిన సేవలు అపారమని పేర్కొన్నారు. మహిళల విద్యాభివృద్ధి, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం సమాజానికి మార్గదర్శకమని అన్నారు.

పూలే ఆలోచనలు నేటికీ ప్రాసంగికంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. సమానత్వ సమాజ నిర్మాణానికి ఆయన చూపిన మార్గమే స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బంధారపు నర్సయ్య, కొంగుల ప్రవీణ్, బెల్లంకొండ నీరజ గౌడ్, లింగం యాదవ్, మామిడి అంజయ్య, మీర్ అక్బర్, కొన్నే మంజుల గౌడ్, కుంభం నాగరాజు, బొల్లె సైదులు, ఆవుల అంజయ్య, కుంభం వెంకన్న యాదవ్, బొమ్మగాని సైదులు, మురళి, చింతకాయల జానయ్య, సైదులు, మధు, మామిడి శోభన్ బాబు, వెంకటేశ్, రఘు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా నిర్వహణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News