Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 11:53 PM

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకుందాం

19-01-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పేదల హక్కులపై దాడిని తిప్పికొట్టాలి

ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిస్తే ఊరుకోం

కార్పొరేట్ ప్రయోజనాలకే కేంద్ర విధానాలు

ప్రజల ఉద్యమంతోనే హక్కుల రక్షణ

జాతాలో ములకలపల్లి రాములు పిలుపు

సూర్యాపేట

పేదల జీవనాధారమైన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఇతర పథకాలను తీసుకురావడం పేదల వ్యతిరేక చర్యగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు విమర్శించారు. 2005లో యూపీఏ వన్ ప్రభుత్వ హయాంలో వామపక్ష పార్టీలు చేసిన పోరాటాల ఫలితంగా సాధించుకున్న జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఆదివారం సాయంత్రం మునగాల మండలంలో నిర్వహించిన జాతాకు ఘన స్వాగతం పలికిన అనంతరం ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం ప్రజలందరూ ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రైతాంగం, కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలు ప్రతిఘటించాలని అన్నారు. భారత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. మోడీ విధానాలకు వ్యతిరేకంగా రేపు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ జాతాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నమ్మాది వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టపల్లి సైదులు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి, సిఐటియు మండల కన్వీనర్ బచ్చలకూరి స్వరాజ్యం, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దేవర వెంకటరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జానయ్య, జిల్లా కమిటీ సభ్యుడు అరె రామకృష్ణారెడ్డి, మండల కమిటీ సభ్యుడు సరికొండ నాగరాజు, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం వినోద్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కిన్నెర వెంకన్న, గడ్డ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకుందాం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News