Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట:దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:02 PM

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కి కేంద్ర ప్రభుత్వం ముప్పు. ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించుకుందాం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కి కేంద్ర ప్రభుత్వం ముప్పు. ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించుకుందాం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కి కేంద్ర ప్రభుత్వం ముప్పు. ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించుకుందాం
January 31, 2026 07:31 AM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి వెంకటేశ్వరరావు. సంఘం జిల్లా నాయకులు తూము కృష్ణయ్య పిలుపు

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో మండలంలోని పెద్దవరం నాలుగు కూడళ్ళ సెంటర్లోని మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని సామూహిక నిరసన దీక్ష కార్యక్రమం చేయడం జరిగింది

కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా నాయకులు.తూము కృష్ణ య్య. జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ

దేశంలోని జాతీయ గ్రామీణ ఉపాధి ఆమీ చట్టాన్ని కమ్యూనిస్టు పార్టీలు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించి అప్పటి యూపీఎ ప్రభుత్వంలో పార్లమెంట్ ద్వారా చట్టం చేసి తీసుకొచ్చింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ దేశములోని నిరుపేదలకు వలసలు నివారణ గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయతర సీజనులు పనులుచేసుకుంటూ ఉన్నారు నిరుపేదల ఆర్థిక భరోసా కల్పించిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు ఈ పథకం వల్ల పేద ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి. నాలుగు మెతుకులు పేదోళ్ల. కడుపుకి వెళ్తున్నాయి. ఈరోజు పేదవాడి జీవన ప్రమాణం పెరిగి బ్యాంకుల మెట్లు ఎక్కగలుగుతున్నారని రిజర్వే బ్యాంకు కితాబ్ ఇచ్చింది అన్నారు. ఈ చట్టానికి . వి .బి .జి రాం.జీ .అనే పేరు మార్చి గ్రామీణ పేదల ఆర్థిక పరిస్థితి పై దెబ్బ కొట్టే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వము చేస్తుంది ఈ విధానాన్ని తక్షణ మానుకొని పాత చట్టం మహాత్మ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత చట్టంలో రాష్ట్రం వాట పది శాతం కేంద్ర ప్రభుత్వం వాటా 90% నిధులు కేటాయింపు జరిగేదని దానిని మార్పు చేసి ఇప్పుడు ఈ కొత్త పథకానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా 40 శాతం కేంద్ర ప్రభుత్వం 60 శాతం ఇవ్వాలని కండిషన్ పెట్టింది. రాష్ట్రానికి కేటాయించిన 40 శాతం. గ్రాంట్లు కేంద్రం 60% గ్రాంట్లు ఇవ్వటం అనేది అసాధ్యం అన్నారు

ఉపాధి హామీ పనులు కేటాయింపు నిర్వహణ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళటం వల్ల రాష్ట్ర ప్రభుత్వము ఏమి చేయలేని నిస్స హయ స్థితిలో ఉంటుందని అప్పుడు రాష్ట్ర అభివృద్ధి కుంటూ కుంటూపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు పథకం మార్పు చేయడం విషయంలో మౌనం వహించటం అత్యంత దుర్మార్గం అన్నారు కావున తక్షణం కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధాతధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఉపాధి హామీ చట్టం స్థానంలో తీసుకొచ్చిన కొత్త పథకం వలన కూలీలకు పనులు కుదిరించబడతాయని రాష్ట్ర ప్రభుత్వాలకు పెనుబారంగా ఉంటుందని దాని ఫలితంగా ఉపాధి కూలీలకు ఉపాధి లేక వ్యవసాయ కూలీలు ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. వంద రోజులు పనిని 120 రోజులు కొత్త చట్టంలో తీసుకువచ్చామని చెబుతున్న ప్రభుత్వం దానికి ఉపాధి హామీ చట్టాన్ని మార్పు చేయాల్సిన అవసరం ఏముంది. 100% నిధులు ఉన్నప్పుడు కూలీలు చేసిన ఉపాధి పనులకు నెలల తరబడి ఆఫీసు ల కూలీలు తిరిగిన. డబ్బులు ఇవ్వలేని ప్రభుత్వం 60 శాతం నిధులు కేటాయిస్తే ఎలా కూలీలకు డబ్బులు వస్తాయని అన్నారు కాబట్టి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయటమంటే ప్రభుత్వము కూలీలకు ఉపాధి లేకుండా వాళ్ళ పొట్ట కొట్టడమే అన్నారు అందుకే పాత చట్టాన్ని అదాతదంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పగిడిమళ్ల రవి, ఎన్ వనమాలి, మారెపోగు పుల్లయ్య, చిలుకూరి ప్రసాదు, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు. లాలయ్య, మరియు ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News