Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:00 PM

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాస్థితిగా కొనసాగించాలని, సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం విస్సన్నపేట

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాస్థితిగా కొనసాగించాలని, సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం విస్సన్నపేట

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాస్థితిగా కొనసాగించాలని, సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం విస్సన్నపేట
February 07, 2026 06:16 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట, గ్రామీణ కష్టజీవులకు పనులు చూపి పేదల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాస్థితిగా కొనసాగించాలని, సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో విస్సన్నపేట మండలంలోని మిట్ట గూడెం తదితర గ్రామీణ ప్రాంతాలలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని మర్సకట్ల త్యాగరాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగిందివ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తూముకృష్ణయ్య మాట్లాడుతూ ఉపాధి కూలీలకు నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బి జి. రాంజీ పథకాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధాతధంగా కొనసాగించాలని, కమ్యూనిస్టు పార్టీలు వ్యవసాయ కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగానే గ్రామీణ పేదలకు పనైనా చూపండి తిండైనా పెట్టండి అనే విధానంతో 2004 లో వామపక్ష పార్టీల భాగస్వామ్యంతో అధికారంలోకి వచ్చిన యూపీఏ వన్ ప్రభుత్వము వామపక్ష ఎంపీల ఒత్తిడితో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించింది అన్నారు ఈ చట్టం ద్వారా గ్రామీణ పేదలకు పనులు లేని వ్యవసాయతల సీజన్లో బాగా ఉపయోగపడి పేదల ఆర్థిక పరిస్థితి మెరుగు పడేవిధంగా తోడ్పడి కనీసం వంద రోజులు ఉపాధి కల్పించబడిందని గుర్తు చేశారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ జి రామ్ జి కొత్త పథకాన్ని తీసుకొచ్చిందని. దీని వెనక ఉద్దేశం పేదలను ఉపాధి హక్కు నుంచి దూరం చేయడమేనని విమర్శించారు ఈ కొత్త పథకం ప్రకారం అన్ని ప్రాంతాలలో పని కల్పించే బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వానికి లేకుండా పోయిందని గ్రామీణ కుటుంబానికి కనీస పని దినాలు వంద రోజులు ఉపాధి హక్కు ఈ పథకంతో ఎగిరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు పాత చట్టం ప్రకారము ఉపాధి హామీ పథకానికి అవసరమైన నిధులలో 90 శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నాంగా. కొత్త చట్టం ప్రకారం రాష్ట్రాలు 40% నిధులు కేటాయిస్తేనే కేంద్ర ప్రభుత్వము కేవలం 60 శాతం మాత్రమే ఇవ్వను ఉందని తెలిపారు కోట్లాది పేదల జీవనాధారమైన ఈ పథకాన్ని ఒక్కసారిగా రద్దు చేస్తే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని భయంతో దశల వారీగా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు బిజెపి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరము కేంద్ర బడ్జెట్లో ఉపాధి పథకానికి కేటాయింపులు తగ్గిస్తూ వస్తుంది ఒక మన ఆంధ్ర రాష్ట్రంలోని 15 నుండి 18 లక్షల వరకు జాబు కార్డులు వివిధ కారణాలతో తొలగించారని గుర్తు చేశారు పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు లేకుండా చేయటంతో పాటు పిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు వికలాంగులు చంటి పిల్లల తల్లులు. వృద్ధులు. మహిళలను ఈ పథకం నుంచి దూరం చేస్తున్నారని మండిపడ్డారు

డిమాండ్స్

ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులు కల్పించాలి. ఉపాధి హామీని వ్యవసాయంతో పాటు ఇతర రంగాలకు అనుసంధానం చేయరాదు. కుటుంబ జాబు కార్డుతో సంబంధం లేకుండా ప్రతి వయోజనుడికి జాబ్ కార్డు ఇవ్వాలి. పని అడిగిన వారికి 200 రోజులు పని దినాలు కల్పించి రోజు కూలి 700 రూపాయలు చెల్లించాలి. కూలీల వేతనాలు చెల్లింపులు ఆలస్యం అయితే వడ్డీతో చెల్లించాలి. సమ్మర్ అలవెన్స్ పునరుద్ధరణ చేయాలి. ప్రతి గ్రూపుకు పని కల్పించాలి పని కల్పించకపోతే ఉపాధి బృతిగా సంవత్సరంలో ప్రతికూలీకి 12,000 వేల రూపాయల ఇవ్వాలి. ఉపాధి పనిలో యంత్రాలను కాంట్రాక్టర్లను నిలుపుదల చేయాలి వంద రోజులు పని పూర్తి చేసుకున్న ప్రతి ఉపాధి కూలీకి పథకంలో చూపెట్టిన విధంగా పనిముట్లు ఇవ్వాలి. పని ప్రదేశాలలో టెంట్లు. కిట్లు. అందించాలి వేసవికాలంలో మజ్జిగ సరఫరా చేయాలి. మెట్ల వ్యవస్థ పునర్దన చేసి వారికి గుర్తింపు కార్డులు అందజేయాలి రోజుకు ఐదు రూపాయలు పారితోషకం ఇవ్వాలి. చేసిన పనికి. పే స్లిప్పులు ఇవ్వాలి. పని ప్రదేశాలలో ప్రమాదాలలోమరణిస్తే 10 లక్షల రూపాయలు . ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. ఉపాధి హామీ పనులు పని చేసే క్షేత్రస్థాయి సిబ్బంది వారికి కుటుంబ జీవనం నిమిత్తం నెల నెల సక్రమంగా జీతాలు చెల్లించాలి. ఉపాధి హామీ పనులు సక్రమంగా నిర్వహించినప్పుడే పేదవారి చేతుల్లో డబ్బులు చలామణి అయి కొనుగోలు శక్తి పెరిగి పేదలకు సామాజిక న్యాయం. ఆత్మగౌర్ణమి కూడా పెరుగుతుంది. అందుకే కొత్త బిల్లుకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి వెంకటేశ్వర రావు. వ్యవసాయ కార్మిక సంఘం తిరువూరు నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ నాగులు మేరా. బి కేశవ. మేడా వెంకటేశ్వరరావు. నాగేశ్వరరావు. మరియు ఉపాధి కూలీలు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News