Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:37 AM

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు

08-02-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బి కే యం యు) రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ జిరాంజీ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ చాట్రాయి మండలం చిన్నంపేటలో వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలతో కలిసి ఆయన విస్తృత ప్రసారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2005 లో సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రద్దుచేసి గాంధీజీని హత్య చేసిన గాడ్సే పేరు వచ్చేలాగా వికసిత్ భారత్ జి రామ్ జి పథకాన్ని తీసుకొచ్చిందని ఆయన తెలిపారు.జి రాం జి పథకం వల్ల గ్రామీణ పేదలకు ఉపాధి పనులు దక్కకుండా పోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టం ఉంటే కేంద్రం 90 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం నిధులు కేటాయించేయని, జీ రాం జీ పథకం ద్వారా కేంద్రం 60 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు కేటాయించడం సాధ్యం కానీ పని అని తద్వారా ఉపాధి హామీని గ్రామీణ పేదలకు లేకుండా చేయాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఐ, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు సంయుక్తంగా ఉపాధి చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ ముద్రించిన కరపత్రాలను గ్రామంలో ఇంటింటికి తిరిగి పేద ప్రజలకు ఇచ్చి విస్తృత ప్రచారాన్ని వ్యవసాయ కార్మికులు చేపట్టారు. ఫిబ్రవరి 9వ తేదీన మండల ఏ పీ ఓ కు వినతి పత్రాలు ఇవ్వాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమానికి కొమ్ము ఆనంద్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు తో పాటు వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సి పి ఐ నూజివీడు నియోజకవర్గ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ మరియు వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు

Article Image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బి కే యం యు) రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ జిరాంజీ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ చాట్రాయి మండలం చిన్నంపేటలో వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలతో కలిసి ఆయన విస్తృత ప్రసారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2005 లో సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రద్దుచేసి గాంధీజీని హత్య చేసిన గాడ్సే పేరు వచ్చేలాగా వికసిత్ భారత్ జి రామ్ జి పథకాన్ని తీసుకొచ్చిందని ఆయన తెలిపారు.జి రాం జి పథకం వల్ల గ్రామీణ పేదలకు ఉపాధి పనులు దక్కకుండా పోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టం ఉంటే కేంద్రం 90 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం నిధులు కేటాయించేయని, జీ రాం జీ పథకం ద్వారా కేంద్రం 60 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు కేటాయించడం సాధ్యం కానీ పని అని తద్వారా ఉపాధి హామీని గ్రామీణ పేదలకు లేకుండా చేయాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఐ, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు సంయుక్తంగా ఉపాధి చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ ముద్రించిన కరపత్రాలను గ్రామంలో ఇంటింటికి తిరిగి పేద ప్రజలకు ఇచ్చి విస్తృత ప్రచారాన్ని వ్యవసాయ కార్మికులు చేపట్టారు. ఫిబ్రవరి 9వ తేదీన మండల ఏ పీ ఓ కు వినతి పత్రాలు ఇవ్వాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమానికి కొమ్ము ఆనంద్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు తో పాటు వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సి పి ఐ నూజివీడు నియోజకవర్గ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ మరియు వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News